E-Paper
Advertisement

Fighter jets as an escort to the flight: ఫ్లైట్‌కు ఎస్కార్ట్‌గా ఫైటర్ జెట్స్..

Fighter jets as an escort to the flight: ఫ్లైట్‌కు ఎస్కార్ట్‌గా ఫైటర్ జెట్స్..
Advertisement

మీరు చూస్తున్న ఫోటో… చదువుతున్న వార్త… రెండూ నిజమే. ఓ విమానానికి కొన్ని యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా వెళ్లాయి. సాధారణంగా పీఎం గానీ, సీఎంలు గానీ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు… భద్రతా సిబ్బంది కొన్ని వాహనాల్లో అనుసరిస్తారు. కానీ.. ఈ సీన్ మాత్రం ఇంతకు ముందెన్నడూ చూడదని. అసలు చరిత్రలోనే ఇలాంటి దృశ్యం కనిపించడం తొలిసారి.

ఇంతకీ విషయం ఏంటంటే.. ఆ విమానం పోలండ్‌ది. అందులో ప్రయాణిస్తున్నది ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు. వాళ్లంతా ఖతార్‌లో జరిగే ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు బయలుదేరారు. ఆ విమానానికే పోలండ్ ప్రభుత్వం యుద్ధ విమానాల్ని ఎస్కార్ట్‌గా చేసి పంపింది. దీనికి బలమైన కారణం ఉంది.

Advertisement

ప్రస్తుతం యుద్ధం చేస్తున్న రష్యా-ఉక్రెయిన్‌లకు పోలండ్ సరిహద్దు దేశం. పోలండ్‌ ఫుట్‌బాల్‌ జట్టు ఫిఫా వరల్డ్‌కప్‌ జరిగే ఖతార్‌కు వెళ్లాలంటే… ఆ రెండు దేశాల ఎయిర్‌బేస్‌ను దాటుకొని వెళ్లాలి. ఇటీవల రష్యాపై ఉక్రెయిన్ ప్రయోగించిన మిస్సైల్ పొరపాటున పోలండ్ భూభాగంలో పడటంతో… ఆ దేశానికి చెందిన ఇద్దరు చనిపోయారు. దాంతో… ఖతార్ బయలుదేరిన ఫుట్‌బాల్‌ జట్టు విమానానికి రక్షణగా… ఫైటర్ జెట్లను పంపింది… పోలండ్ ప్రభుత్వం. పొరపాటున ఏదైనా మిస్సైల్ దూసుకొచ్చినా గుర్తించి దాన్ని మధ్యలోనే పేల్చివేసేందుకు… ఫ్లైట్‌కు ఎస్కార్ట్‌గా ఫైటర్ జెట్స్ పంపింది. ఫుట్‌బాల్‌ జట్టు విమానం ఖతార్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యాక… ఫైటర్‌ జెట్స్‌ తిరిగి పోలండ్‌కు చేరుకున్నాయి. గాల్లో ఎగురుతున్న విమానానికి ఇరువైపులా ఫైటర్‌ జెట్స్‌ ఎస్కార్ట్‌గా వెళ్తున్న దృశ్యాల్ని… పోలాండ్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ తమ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ వైరల్‌గా మారింది. ఇదేందయ్యా ఇది… ఇలాంటి సీన్ ఇంతకు ముందెప్పుడూ చూడలేదే! అని వీడియో చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఫిఫా చరిత్రలో ఒక ఫుట్‌బాల్‌ జట్టు ఆతిథ్య దేశానికి ఇలా ఎస్కార్ట్‌తో వెళ్లడం ఇదే తొలిసారి అని మరికొందరు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×