Big TV Kissik Talks..ప్రముఖ యూట్యూబర్ గా, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గా పేరు సొంతం చేసుకున్న గంగవ్వ (Gangavva) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అక్కర్లేదు. ఎక్కడో పొలం పనులు చేసుకుంటూ.. జీవనాన్ని సాగిస్తున్న 67 ఏళ్ల గంగవ్వ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అదే క్రేజ్ తో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన ఈమె ఊహించని పాపులారిటీ అందుకుంది. అంతేకాదు స్టార్ హీరో నాగార్జున (Nagarjuna) ఇచ్చిన రూ.7లక్షల సహాయంతో.. బిగ్ బాస్ ద్వారా వచ్చిన మరో రూ.8 లక్షలు, అప్పటివరకు తాను సంపాదించుకున్న డబ్బు మొత్తం కలిపి సొంత ఇంటి కలను నెరవేర్చుకుంది గంగవ్వ.
స్టార్ హీరో అంటే ఇష్టం అంటున్న గంగవ్వ..
ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలు, షోలు చేస్తూ బిజీగా మారిన ఈమె.. తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్(Kissik talks) అనే కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎపిసోడ్ ని నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. ఇందులో భాగంగానే అటు పొలిటికల్ ఎంట్రీ, ఇటు బిగ్ బాస్ 9 ఎంట్రీ పై స్పందించిన గంగవ్వ.. అందులో భాగంగానే తనకు ఒక స్టార్ హీరో అంటే ఇష్టమని, ఆయనతో కలిసి నటించాలని ఉంది అంటూ తన మనసులో మాటగా చెప్పుకొచ్చింది. మరి గంగవ్వ మనసులో ఉన్న ఆ హీరో ఎవరు? ఎవరితో ఆమె నటించాలనుకుంటుంది? అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
స్టార్ హీరో సినిమాలో అవకాశం కోసం ఎదురుచూపు..
ఇంటర్వ్యూలో భాగంగా మీరు ఎవరితో నటించాలని కోరుకుంటున్నారు అంటూ చిరంజీవి (Chiranjeevi ), నాగార్జున(Nagarjuna ), వెంకటేష్ (Venkatesh) బాలకృష్ణ (Balakrishna), రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun), ప్రభాస్(Prabhas ) ఇలా కొంతమంది హీరోల పేర్లను యాంకర్ వర్షా (Varsha) ప్రస్తావించగా.. గంగవ్వ మాట్లాడుతూ.. “చిరంజీవి, రామ్ చరణ్, బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) వంటి హీరోలతో కలిసి చేశాను. అయితే ఇప్పుడు నాకు అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ఉంది.” అంటూ తన మనసులో కోరిక బయట పెట్టింది గంగవ్వ.
అల్లు అర్జున్ సినిమాలో ఎలాంటి పాత్ర కావాలి? అని అడగ్గా..” ఎలాంటి పాత్ర ఇచ్చినా చేస్తాను. మసి గుడ్డలు కట్టుకొని నటించమన్నా సరే నేను నటిస్తాను. గత నాలుగు సంవత్సరాలుగా అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. అందుకే ఒకసారి కలవాలి, ఆయన సినిమాలో భాగం కావాలని కోరుకుంటున్నాను” అంటూ గంగవ్వ చెప్పుకొచ్చింది. తర్వాత పుష్ప(Pushpa ) సిగ్నేచర్ డైలాగ్ అయినా “పుష్ప తగ్గేదేలే” అనే డైలాగ్ తో అందరినీ నవ్వించింది గంగవ్వ. మొత్తానికైతే గంగవ్వకు అల్లు అర్జున్ సినిమాలో నటించాలని చాలా కోరికగా ఉందట. మరి డైరెక్టర్స్ ఆమె కోసం ఏదైనా పాత్ర క్రియేట్ చేస్తారేమో చూడాలి.
also read: Akhanda 2 Teaser Update: అఖండ 2 నుండి బిగ్ అప్డేట్.. టీజర్ డేట్ లాక్!
స్టార్ హోదా దిశగా గంగవ్వ ప్రయాణం..
ఇక గంగవ్వ విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలు గా విరాజిల్లుతోంది.. పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా 67 ఏళ్ల వయసులో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హోదాను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇక ప్రస్తుతం గంగవ్వ గెస్ట్ గా వచ్చిన కిస్సిక్ టాక్స్ షో ఎపిసోడ్ కూడా వైరల్ గా మారింది.