Kidney Health: కిడ్నీ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవం. ఇది శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అందుకే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి ఇది చాలా ముఖ్యం. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆకుకూరలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆకు కూరలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయి. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకు కూరల ప్రయోజనాలు:
నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం.. ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు ఎ, సి, కె, ఫోలేట్, ఐరన్ , కాల్షియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరానికి బలాన్ని ఇస్తాయి. అంతే కాకుండా మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ అంశాలు మూత్రపిండాల పనితీరును నిర్వహించడంలో సహాయపడటమే కాకుండా.. మొత్తం శరీరం యొక్క రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తాయి. ఆకు కూరలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం నుండి వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. ఇవి మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
పాలకూర:
పాలకూరలో ఐరన్ , ఫోలేట్ మాత్రమే కాకుండా.. బీటా కెరోటిన్ , విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో అంతే కాకుండా వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. ఈ మూలకాలు మంచి మూత్రపిండాల పనితీరుకు చాలా అవసరం. ముఖ్యంగా శరీరం డీటాక్స్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు.
కాలే:
కాలేలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల దీనిని సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. ఇది కిడ్నీలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది. అంతే కాకుండా ఇది మూత్రపిండాల కణాలకు నష్టం జరగకుండా నిరోధిస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది.
బోక్ చోయ్:
బోక్ చోయ్ అనేది కాల్షియం, పొటాషియం, విటమిన్ సి కలిగి ఉన్న తేలికైన మరియు పోషకమైన ఆకు కూర. ఈ పోషకాలు కిడ్నీ వాపును తగ్గించడానికి.. అంతే కాకుండా డీహైడ్రేషన్‌ను తగ్గించడంతో పాటు వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడానికి సహాయపడతాయి . దీనిని ఆహారంలో.. ముఖ్యంగా సూప్‌లు లేదా తేలికపాటి సలాడ్‌లలో కూడా చేర్చుకోవచ్చు.
Also Read: ముఖంపై మంగు మచ్చలా ? పెరుగు ఇలా వాడితే.. ప్రాబ్లమ్ సాల్వ్
ఆవాల కూర:
ఆవాల ఆకుకూరల్లో ఐరన్, ఫైబర్, విటమిన్లు ఎ , సి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరం నుండి వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మూత్ర వ్యవస్థను శుభ్రంగా ఉంచుతుంది. ఇందులో లభించే యాంటీఆక్సిడెంట్లు కిడ్నీ కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. అంతే కాకుండా వాపును కూడా తగ్గిస్తాయి. అందుకే ఆహారంలో భాగంగా ఆవాల కూరలను చేర్చుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.