Akhanda 2 Teaser Update: నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్లో వచ్చిన చిత్రం అఖండ (Akhanda). ఈ సినిమా అప్పట్లో కథపరంగానే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా సంచలనం సృష్టించింది. బాలయ్య మాస్ ఇమేజ్ను రెట్టింపు చేసింది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ గా ‘అఖండ 2కి తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక అంతేకాదు ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal)తో పాటు సంయుక్త మీనన్ (Samyuktha Menon) కూడా ఈ సినిమాలో హీరోయిన్గా భాగమైంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి థమన్ (Thaman)సంగీతం అందిస్తున్నారు. ముఖ్యంగా పార్ట్ 1 కంటే పార్ట్ 2 లో అంతకుమించి ఉంటుందని, ఈసారి థియేటర్లలో స్పీకర్లు బద్దలు ఇవ్వడం ఖాయమని థమన్ ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అఖండ 2 టీజర్ అప్డేట్..
ఇకపోతే అంతా బాగానే ఉన్నా.. ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ వదలలేదు. అయితే ఇప్పుడు అభిమానులలో అంచనాలు పెంచేలా “అఖండ తాండవం షురూ” అంటూ మేకర్స్ ఒక పోస్టర్ విడుదల చేస్తూ.. బిగ్ అప్డేట్ జూన్ 8 ఉదయం 10:54 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు యూనిట్ వెల్లడించగా.. అందులో భాగంగానే అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా మేకర్స్ అప్డేట్ వదిలారు. మరి ఆ బిగ్ అప్డేట్ ఏంటి అనే విషయానికి వస్తే.. జూన్ 9 సాయంత్రం 6:03 గంటలకు అఖండ 2 టీజర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇందులో త్రిశూలం అత్యంత శక్తివంతంగా చూపిస్తూ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
also read: Nayanthara Vs Trisha: మళ్లీ భగ్గుమన్న వివాదం.. అసలేం జరుగుతోంది?
బాలకృష్ణ కెరియర్..
బాలకృష్ణ కెరియర్ విషయానికి వస్తే.. తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా యుక్తవయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఎక్కువగా తన తండ్రి నటించి, దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రాలలోనే బాలయ్య ఎక్కువగా నటించడం జరిగింది. ఆ తర్వాత హీరోగా మారి మాస్ హీరోగా, అటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హీరోగా కూడా పేరు సొంతం చేసుకున్నారు .
ఇక ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు బాలయ్య. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాస్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక మరొకవైపు రాజకీయ నాయకుడిగా ప్రస్తుత హిందూపురం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు.అంతేకాదు బాలయ్య హోస్ట్ గా కూడా సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వేదికగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే కార్యక్రమానికి హోస్టుగా చేశారు. అలా దాదాపు ఎంతోమంది హీరోలతో సందడి చేసి హోస్టుగా కూడా సక్సెస్ అయ్యారు బాలయ్య.
Brace yourselves for the divine fury 🔥 #Akhanda2 – The Teaser Thaandavam from tomorrow ❤🔥#Akhanda2Teaser out on June 9th at 6.03 PM 🔱🔥#Akhanda2Thaandavam
'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial @MusicThaman @14ReelsPlus @iamsamyuktha_… pic.twitter.com/bD5Y7uRofb— 14 Reels Plus (@14ReelsPlus) June 8, 2025