Rahul Gandhi on Adani: అదానీని ప్రధాని మోడీనే కాపాడుతున్నాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా భారత్ చట్టాలను అదానీ ఉల్లంగించారనే విషయంపై ఇప్పుడు స్పష్టత వచ్చిందని అన్నారు. మోడీ అదానీల బంధం భారత్ లో ఉన్నంతవరకే సురక్షితమని వ్యాఖ్యానించారు. లంచం ఆరోపణలపై అదానీపై కేసు నమోదు కాగా వెంటనే ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
Also read: నేడు, రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ప్రాంతాల నుంచి వెళ్లకపోవడమే మంచిది..
అదానీ ఇంత స్వేచ్ఛగా ఎలా బయట తిరుగుతున్నారని రాహుల్ ప్రశ్నించారు. ఆయన రూ.2వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. అదానీని ఎందుకు అరెస్ట్ చేయడం లేదో మోడీ చెప్పాలని అన్నారు. అదానీ ఏం చేశారో తాము దేశ ప్రజలకు చెప్పగలిగామని వ్యాఖ్యానించారు. తాజాగా అదానీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తక్షణమే జేపీసీతో విచారణ జరిపించాలని రాహుల్ అభిప్రాయపడ్డారు.
శీతాకాల సమావేశాలలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు. తన అవినీతి ద్వారా అదానీ దేశ సంపదనంతా కొల్లగొట్టారని ఆరోపించారు. అదానీని రక్షిస్తే సెబీ చీఫ్ ను ఆ పదవి నుండి తొలగించి ఆమెపై కూడా విచారణ జరిపించాలని చెప్పారు. లంచం ఆరోపణలు ఎదురుకుంటున్న రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా విచారణ జరింపించాలని రాహుల్ డిమాండ్ చేశారు. అదానీ అరెస్ట్ కాడని.. ఆయనను అరెస్ట్ చేయరని, ఎందుకంటే ఆయన వెనక మోడీ ఉన్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.