BigTV English

Good News To Telangana Women’s: మహిళలకు గుడ్ న్యూస్.. చీరల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు.. ఈ స్కీమ్ వారి కోసమే!

Good News To Telangana Women’s: మహిళలకు గుడ్ న్యూస్.. చీరల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు.. ఈ స్కీమ్ వారి కోసమే!

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి
మహిళా సంఘాలకు చీరలు


⦿ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
⦿ అంగన్వాడీ టీచర్లు, ఆయాలతోపాటు మహిళా సంఘ సభ్యులకు చీరలు
⦿ సచివాలయంలో తుది చీరల ఎంపిక
⦿ అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి సీతక్క
⦿ త్వరలోనే ఫైనలైజ్ చేయనున్న సీఎం

హైదరాబాద్, స్వేచ్ఛ: Good News To Telangana Women’s: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ చరిత్రలో మొదటి సారి మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫాం చీరలు పంపిణీ చేయాలని డిసైడ్ అయింది. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు ఉచితంగా వీటిని ఇవ్వాలని నిర్ణయించింది. ఈ చీరల కోసం ప్రత్యేకంగా డిజైన్లు తయారు చేయిస్తున్నారు.


గురువారం సచివాలయంలో మహిళా సంఘాల కోసం తయారు చేస్తున్న చీరలను మంత్రి సీతక్క పరిశీలించారు. సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వాటిని మంత్రికి చూయించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ యూనిఫాం చీరలను ఫైనలైజ్ చేయనున్నారు. ఆ తర్వాత 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు పంపిణీ చేస్తారు. తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా వీరికి పంపిణీ చేయనుంది ప్రభుత్వం.

Also Read: MLA Yennam Srinivas Reddy: భార్యను మార్చే సంస్కృతి మాది కాదు.. మీకు ఉందేమో తెలియదు.. ఎమ్మేల్యే యెన్నం

అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కూడా
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఇచ్చే చీరల ఎంపిక కూడా పూర్తవుతోంది. మంత్రి సీతక్కకు పలు రకాల చీరలను పరిశీలించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీలకు ఇచ్చే చీరలకు సంబంధించి పలు సూచనలు చేశారు సీతక్క.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×