Pawan Kalyan Prabhas: మల్టీ స్టారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరే లెవెల్. ఎప్పుడైనా ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారని తెలిస్తే.. అది మినిమమ్ గ్యారెంటీ హిట్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. ఒకప్పుడు సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు అని తేడా లేకుండా చాలామంది ఈ మల్టీ స్టారర్ కథల్లో నటించడానికి ఇష్టపడేవారు. కానీ గత కొన్నేళ్లలో హీరోలంతా ఎవరి ప్రాజెక్ట్స్‌తో వారు బిజీ అయిపోయారు. పైగా పాన్ ఇండియా అనే క్రేజ్‌లో పడి ఒక సినిమాకు కనీసం రెండేళ్లు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఫోటోలు వైరల్
‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ అని ట్యాగ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. అందుకే ఆ తర్వాత నుండి తను నటిస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి. అలా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్ చాలా బిజీ అయిపోయాడు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. తను ఒకవైపు సినిమాలు, మరొకవైపు రాజకీయాలతో చాలా బిజీ అయిపోయారు. తను ఎప్పుడో కమిట్ అయిన ప్రాజెక్ట్స్‌ను పూర్తిచేయడానికే సమయం కుదరడం లేదు. ఇలాంటి సమయంలో కొత్త ప్రాజెక్ట్స్‌ను ఓకే చేస్తారా లేదా అనే సందేహాలు కూడా ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫోటోలు మూవీ లవర్స్‌లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.
Also Read: కీర్తి సురేశ్ భర్త ఆంటోని తట్టిల్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
త్వరలోనే ఒకే ఫ్రేమ్‌లో
హీరోలుగా తమ కెరీర్ ప్రారంభించినప్పటి నుండి ప్రభాస్ అసలు మల్టీ స్టారర్ సినిమాల్లో నటించలేదు. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు పలు హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరికీ ఉన్న పాపులారిటీకి, చేతుల్లో ఉన్న ప్రాజెక్ట్స్‌కు కలిసి నటించడం చాలా కష్టం. అయినా కూడా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ (OG)లో ప్రభాస్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడని కొన్నాళ్ల క్రితం వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయని, అసలు వారిద్దరినీ ఒకే సినిమాలో చూడడం ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఊహించుకుంటూ ఏఐతో ఎడిట్స్ చేస్తూ అవి చూసుకుంటూ మురిసిపోతున్నారు.
అప్‌కమింగ్ సినిమాలు
ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ మూవీలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. దీని తర్వాత తను ‘స్పిరిట్’ కోసం సిద్ధమవుతున్నాడు. ‘స్పిరిట్’లో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే రివీల్ చేశాడు. దీంతో ప్రభాస్‌కు పోలీస్ యూనిఫార్మ్ వేసి ఏఐ సాయంతో ఫోటోలు ఎడిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఒకవేళ సినిమాలో కూడా ప్రభాస్ ఇదే లుక్‌తో ఉంటే కచ్చితంగా మూవీ హిట్ అవ్వడం ఖాయమని ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విషయానికొస్తే.. తను ఒకవైపు ‘హరిహర వీరమల్లు’, మరొకవైపు ‘ఓజీ’.. ఈ రెండు సినిమాలను ఒకేసారి పూర్తిచేయడానికి సిద్ధమయ్యారు.