Cooli Movie – Chikitu Vibe : ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ దర్శకులలో లోకేష్ కనకరాజ్ ఒకరు. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మా నగరం అనే సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు లోకేష్. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇదే సినిమా నగరం పేరుతో తెలుగులో కూడా విడుదలైంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ రెజీనా కసాండ్రా నటించారు. చాలామందిని తన డైరెక్షన్ తో ఆశ్చర్యపరిచాడు లోకేష్. ఈ సినిమా తర్వాత లోకేష్ కార్తీతో ఖైదీ అనే సినిమాను తెరకెక్కించాడు. ఖైదీ సినిమా ఎటువంటి సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కార్తీ నటించిన ఈ సినిమా లోకేష్ కు విపరీతమైన పేరును తీసుకొచ్చింది. ఒక రాత్రి ప్రయాణాన్ని చాలా ఆసక్తికరంగా చూపించాడు లోకేష్. ఒక సినిమాగా ఖైదీని చూసినప్పుడు చాలా బాగా అనిపించిన విక్రమ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖైదీ సినిమా మీద ఇష్టం చాలా మందికి మరింత పెరిగిపోయింది అలానే ఖైదీ 2 సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. దాదాపు 500 కోట్లకు పైగా ఆ సినిమా వసూలు చేసింది. కమల్ హాసన్ కెరియర్లో స్ట్రాంగెస్ట్ కం బ్యాక్ ఫిలిం అయింది. ఇక ఆ సినిమాతోనే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను ఇండియన్ సినిమాకి పరిచయం చేశాడు.
Also Read : Pushpa 2 : కంగువ టార్గెట్ పుష్ప 2 ఫినిష్ చేస్తుందా.?
కమల్ హాసన్ కెరీర్ కి కలెక్షన్స్ పరంగా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన లోకేష్ ఇప్పుడు రజనీకాంత్ కూడా హిట్ ఇచ్చే పనిలో పడ్డాడు. రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా అనౌన్స్మెంట్ కి సంబంధించిన వీడియోతోనే అందరిని ఆశ్చర్యపరిచాడు లోకేష్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. నేడు రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ‘చికిటు వైబ్’ అనే వీడియోను రిలీజ్ చేశారు. రజినీకాంత్ లోని ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో అదే స్టైల్ ను స్వాగ్ ను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాడు లోకేష్. వీడియో ఓపెన్ కావడంతోనే స్లీవ్స్ మడత పెడుతున్న రజిని స్టైల్ కి కొంత మంది ఫిదా అయిపోవడం ఖాయం. ఆ తర్వాత రజనీ కైండ్ ఆఫ్ స్టెప్స్ ఇంకా మంచి కిక్ ఇచ్చాయి. ఈ ఏజ్ లో కూడా అంత ఎనర్జీ స్వాగ్ ను తలైవర్ ఎలా మేనేజ్ చేశారు అనేది చాలామందికి ఆశ్చర్యం కలిగించే విషయం. మొత్తానికి బర్తడే కి పర్ఫెక్ట్ బ్లాస్ట్ అందించాడు లోకేష్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధిస్తుందని చాలామంది అంచనా వేస్తున్నారు.