BigTV English

Special Trains: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు!

Special Trains: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు!

Special trains for Diwali and Dussehra: రైల్వే ప్రయాణికులు శుభవార్త. దసరా, దీపావళి పండుగల దృష్ట్యా ప్రయాణికుల రద్దీని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు దసరా, దీపావళి పండుగలకు ప్రస్తుతం వివిధ మార్గాల మధ్య నడుస్తున్న రైళ్లకు అదనంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అలాగే అదనపు కోచ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.


ప్రస్తుతం ఉన్న రైళ్లకు ఈ ఏడాది అదనంగా 12,500 కోచ్‌లను జత చేస్తున్నామని రైల్వే మంత్రి అన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 5,975 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు మంత్రి పేర్కొన్నారు. పండుగ వేళ 108 రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచినట్లు తెలిపారు.

దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక రైళ్లకు 12,500 కోచులను అదనంగా జత చేస్తున్నామని పేర్కొన్నారు. 2024-25 ఏడాదిలో తాము తీసుకున్న నిర్ణయంతో దాదాపు కోటిమంది ప్రయాణికులకు సౌకర్యం సులభతరమైందని వెల్లడించారు.


ఇదిలా ఉండగా, దసరా, దీపావళి పండుగలకు చాలా ప్రత్యక స్థానం ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఈ పండుగలను ప్రజలు చాలా విశేషంగా నిర్వహించుకుంటారు. తమ కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను కలుసుకుంటూ వేడుకలు చేసుకుంటారు. ఈ క్రమంలో ఎక్కువ శాతం ప్రజలకు ప్రయాణాలు చేస్తుంటారు. అందుకే రైళ్ల సంఖ్యను పెంచుతున్నామని మంత్రి వివరించారు.

Also Read: సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ఎఫ్ఐఆర్ దాఖలు..గట్టిగానే చుట్టుకున్న ‘ముడా’!

గతేడాది కంటే ఈ ఏడాది ప్రత్యేక రైళ్ల సంఖ్యను పెంచింది. 2023-24 ఏడాదిలో దసరా, దీపావళి పండుగ సీజన్‌లో 4,429 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు రైల్వే మంత్రి తెలిపారు. అయితే ఈ ఏడాది అదనంగా నడుపుతున్నట్లు తెలిపింది. ప్రయాణికులు రద్దీని దృష్టిలో ఉంచుకొని 5,975 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు. కాగా, ఇప్పటికే ఈ పండగల దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్లను నడపుతున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×