BigTV English

Grasshoppers:- మిడతల సామర్థ్యంతో ‘స్మెల్ బోట్స్’ తయారీ..

Grasshoppers:- మిడతల సామర్థ్యంతో ‘స్మెల్ బోట్స్’ తయారీ..

Grasshoppers:- ఇప్పటివరకు రోబోలు మనుషులు చెప్పే సూచనలు గమనిస్తూ పనిచేసేవే. ఏళ్లు గడుస్తున్నకొద్దీ రోబోలలో కూడా మార్పులు చేయడం మొదలుపెట్టారు శాస్త్రవేత్తలు. మెల్లగా అవి నడవడం, ఆలోచించడం లాంటివి మొదలుపెట్టాయి. తాజాగా కేవలం వాసనలను గుర్తించడానికి శాస్త్రవేత్తలు ఓ కొత్త రకమైన రోబోను కనిపెట్టారు. అవే ‘స్మెల్ బోట్స్’.


స్మెల్ బోట్స్ అనేవి బయో మెడికల్ ఇన్వెన్షన్. ఇది ఒక మిడతలోని కణాలను ఎలక్ట్రానిక్స్‌తో కలిపి తయారు చేశారు. ఇప్పటికే స్మెల్ బోట్స్ అనేవి అభివృద్ధి చెందిన దేశాల్లోని ఎయిర్‌పోర్టులలో ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ఎవరి లగేజ్‌లో అయినా గంజాయిలాంటివి ఉన్నాయా అని సులువుగా కనిపెట్టే అవకాశం ఉంది. కొన్ని ఎయిర్‌పోర్టులలో ఈ పనికోసం పోలీస్ డాగ్స్‌ను ఉపయోగిస్తున్నా కూడా స్మెల్ బోట్స్ కూడా ఈ పనిని సులువుగా చేయగలవని శాస్త్రవేత్తలు హామీ ఇస్తున్నారు.

దాదాపు ఎన్నో వేల ఏళ్ల నుండి కీటకాలు అనేవి ఉన్నాయి. అందులో ప్రతీ ఒక కీటకానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. అయితే ఈ స్మెల్ బోట్స్ కోసం మిడతలనే ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే.. వాటికి వాసనలను సులువుగా కనిపెట్టగలిగే గుణమే అని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అందుకే దానిలోని ఆ గుణాన్ని తీసుకొని ఒక కృత్రిమ మేధస్సుతో జోడించి ఈ స్మెల్ బోట్స్‌ను తయారు చేశామని తెలిపారు. ఈ స్మెల్ బోట్స్ పలు ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌ను కూడా కనిపెట్టగలవని వారు అన్నారు.


ఈ పరిశోధన మొదటి స్టేజ్‌లలోనే ఉండడం వల్ల ప్రస్తుతం స్మెల్ బోట్స్ కేవలం 8 వాసనలను మాత్రమే గుర్తించగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ పరిశోధనలో ఉపయోగించిన మిడతలకు వారు ఏ ప్రాణహాని చేయలేదని శాస్త్రవేత్తలు హామీ ఇచ్చారు. ఒక మిడత నుండి ఒక యాంటీనా మాత్రమే తీసుకున్నామని, మిగిలిన ఒక యాంటీనాతో మిడతల జీవనం సాగుతుందని వారు స్పష్టం చేశారు. భవిష్యత్తులో స్మెల్ బోట్స్‌కు నావిగేషన్ టెక్నాలజీ కూడా జోడించనున్నట్టు వారు తెలిపారు.

Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×