BigTV English

Green Hydrogen : గ్రీన్ హైడ్రోజన్ తయారీకి కేంద్రం సాయం.

Green Hydrogen : గ్రీన్ హైడ్రోజన్ తయారీకి కేంద్రం సాయం.


Green Hydrogen : గాలిలో కార్బన్ డయాక్సైడ్ మోతాదు రోజురోజుకీ పెరిగిపోతోంది. ముందుగా దీనిని అదుపు చేయగలిగితే.. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ కాలుష్యం లాంటివి అదుపులోకి తీసుకురావచ్చని శాస్త్రవేత్తలు ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే వారు ఓ నిర్ణయానికి వచ్చారు. గాలిలో కలిసే కార్బన్‌ను తగ్గించాలంటే గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షనేమ పరిష్కారం అని వారు భావిస్తున్నారు.

ఈ ఏడాది కేంద్రం కూడా బడ్జెట్‌లో గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించే దిశగా అడుగులు వేసింది. రూ.350 బిలియన్‌ను క్లైమెట్ పాలిసీని మెరుగుపరచడానికి కేటాయించింది. ఈ బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ విభాగంలో ఎన్నో ప్రయత్నాలు మొదలుపెట్టాలని పర్యావరణవేత్తలు అనుకుంటున్నారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్‌పై ఫోకస్ పెట్టాలని వారు భావిస్తున్నారు. ఇప్పటికే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ విషయంలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. 2070 లోపు అసలు ఇండియాలో గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది ఉండకూడదని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు.


నరేంద్ర మోదీ చెప్పిన మాట ప్రకారం పర్యావరణవేత్తలు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ దీనికి తగిన చర్యలు ఎలా తీసుకోవాలో అన్న విషయంలో వారికి ఇంకా పూర్తిస్థాయిలో క్లారిటీ రాలేదు. క్లైమెట్ ఛేంజ్ కోసం కష్టపడడం కోసం కేంద్రం బడ్జెట్‌ను కేటాయించింది. కానీ 2070లోపు అనుకున్నది సాధించాలంటే మాత్రం ఎన్నో సంవత్సరాల ప్లానింగ్ అవసరమని పర్యావరణవేత్తలు అంటున్నారు. కానీ కొందరు మాత్రం అదే పనిగా కృషిగా చేస్తే అది సాధ్యమయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర బడ్జెట్‌లో రూ.19.7 బిలియన్ కేవలం గ్రీన్ హైడ్రోజన్‌ను తయారు చేయడానికి మాత్రమే కేటాయించారు. ఎనర్జీ ద్వారా నీటిలోని ఆక్సిజన్‌ను, హైడ్రోజన్‌ను విడివిడిగా విభజించవచ్చు. ఫాజిల్ ఫ్యూవల్స్ స్థానంలో ఈ హైడ్రోజన్‌ను ఉపయోగించవచ్చు. ప్రస్తుతం ఈ ఫ్యూవల్స్‌తో నడుస్తున్న పరిశ్రమలు హైడ్రోజన్‌ను ఉపయోగించడం వల్ల కార్బన్ గాలిలో కలిసే శాతం మరింత తగ్గిపోతుంది. సిమెంట్, స్టీల్‌వంటి పరిశ్రమలకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ విభాగానికి 48 శాతం ఎక్కువ బడ్జెట్ అందింది. అంటే పూర్తిగా రూ.10.22 బిలియన్ క్లైమెట్ ఛేంజ్ కోసం వారికి కేటాయించారు. ఈ బడ్జెట్‌తో వారు పర్యావరణ సంరక్షణ, అడవుల సంరక్షణ లాంటివి చేయవలసి ఉంటుంది. అయితే గ్రీన్ హైడ్రోజన్ విషయంలో అన్ని విధాలుగా ముందుకు వెళ్లడానికి ఇండియా ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉందని పర్యవరణవేత్తలు అంటున్నారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×