BigTV English

Honda Activa: త్వరలో మార్కెట్లోకి హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్!

Honda Activa: త్వరలో మార్కెట్లోకి హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్!

Honda Activa: పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. కాలుష్యం పెరిగిపోతోంది. దీంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఈవీల హవా నడుస్తోంది. ఈక్రమంలో దిగ్గజ వాహన తయారీ సంస్థ హోండా కూడా త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది.


హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆ కంపెనీ సీఈఓ అత్సుశి ఓగాటా తెలిపారు. 2024 జనవరిలో ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ స్కూటర్‌ను బ్యాటరీ స్వాపింగ్ ఫెసిలిటీతో తీసుకొస్తున్నామని.. ఇందుకోసం బెంగళూరుకు చెందిన మెట్రో రైల్ కార్పొరేషన్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 6 వేల బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ఈ స్కూటర్ ఫ్లాట్ సీటు, ఇండికేటర్ మౌంటెడ్ ఫ్రంట్ ఎప్రాన్ వంటి ఫీచర్లను కలిగి ఉండనుంది. ప్రస్తుతం మార్కెట్లో టాప్‌లో ఉన్న సింపుల్ ఎనర్జీ వన్, ఏథర్ 450 ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి మోడళ్లకు ఈ స్కూటర్ గట్టి పోటీనివ్వనుంది. దీనిని అంతర్జాతీయ మార్కెట్లో కూడా విక్రయించనున్నట్లు తెలుస్తోంది.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×