BigTV English

Balakrishna: తొక్కినేని తూచ్.. బాలయ్య తగ్గేదేలే!

Balakrishna: తొక్కినేని తూచ్.. బాలయ్య తగ్గేదేలే!

Balakrishna: తగ్గేదేలే అంటున్నారు బాలయ్య. అక్కినేనిని తొక్కినేని అనడంపై తూచ్ అనేశారు. ఏదో ఫ్లోలో వచ్చేసిందని.. అభిమానంతో మాట్లాడిన మాటలను.. వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఏఎన్నార్ ను కించపరచాలని కాదని.. కావాలని ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని క్లారిటీ ఇచ్చారు. బయట ఏం జరిగినా తాను పట్టించుకోనని చాలా లైట్ తీసుకున్నారు బాలకృష్ణ.


ఎన్టీఆర్, ఏఎన్నార్ లను అభిమానంతో మరోరకంగా పిలుచుకుంటారని.. అలా అన్నంతమాత్రాన అవమానించినట్టు కాదంటూ తనదైన స్టైల్ లో వివరణ ఇచ్చారు బాలయ్య. ఎన్టీఆర్, ఏఎన్నార్ లు ఇండస్ట్రీకి రెండు కళ్లు లాంటివారని పొగడ్తలతో ముంచెత్తారు.

పనిలో పనిగా పరోక్షంగా అక్కినేని ఫ్యామిలీకి కౌంటర్ కూడా వేశారు. ఏఎన్నార్ తన బిడ్డలకంటే కూడా తనపైనే ఎక్కువ ప్రేమ చూపించేవారని చెప్పడం ఆసక్తికరం. ఇక, అక్కినేనిని తాను బాబాయ్ అని ప్రేమతో పిలుచుకునే వాడినని.. బాబాయ్ పై ప్రేమ తన గుండెల్లో ఉంటుందన్నారు బాలయ్య. పొగడ్తలకు పొంగిపోకూడదని అక్కినేనిని చూసే తాను నేర్చుకున్నానని సెలవిచ్చారు.


ఇలా.. తన వ్యాఖ్యలపై ఎక్కడా పశ్చాత్తాపం కానీ, క్షమాపణలు కానీ చెప్పకుండా తనదైన వాగ్థాటితో ఇష్యూని చాలా సింపుల్ గా ముగించేశారు బాలయ్య బాబు. పైగా తన తప్పేమీ లేదని.. అంతా మీరే చేశారంటూ ఇతరులపైకి నెట్టేశారు. ఏఎన్నార్.. తాను క్లోజ్ కాబట్టి.. తానేదో అంటే అంటా.. మీరేంటి ఇలా రాద్దాంతం చేస్తున్నారనేలా రివర్స్ అటాక్ చేశారు బాలకృష్ణ.

ఫ్లోలో వచ్చేసిందంటే సరిపోతుందా? ఫ్లోలో ఎవరినైనా ఏదైనా అనేస్తారా? బాలయ్య తగ్గు..తగ్గు.. అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. అప్పుడు తొక్కినేని అని.. ఇప్పుడు బాబాయ్ అంటూ కవర్ చేస్తే సరిపోదని.. క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×