E-Paper
Advertisement

Horoscope 27 September 2024: ఈ రాశి వారికి ఊహించని ధన లాభం.. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం!

Horoscope 27 September 2024: ఈ రాశి వారికి ఊహించని ధన లాభం.. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం!

Horoscope 27 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. సంకటహర గణపతి స్తోత్రం పఠిస్తే మంచిది.

వ‌ృషభం:
వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో కొత్త పనులు చేపడుతారు. ఉద్యోగులు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. తద్వారా ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కీలక వ్యవహారాల్లో బంధుమిత్రుల సహకారం తీసుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ బలాన్ని ఇస్తుంది.

మిథునం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు మనోధైర్యంతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంతంత మాత్రమే ఉంటాయి. కీలక విషయాల్లో బంధుమిత్రులను సంప్రదిస్తారు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. పెండింగ్ సమస్యల నుంచి బయటపడతారు. ప్రయాణాలు వాయిదా మంచిది. చంద్రశేఖర అష్టకాన్ని చదివితే మంచిది.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులను చిత్తశుద్ధితో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ఎదురయ్యే ఆటంకాలు, సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఊహించని ధన లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ప్రార్థన శుభకరం.

సింహం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. కీలక విషయాల్లో తోటివారి సహకారం తీసుకుంటారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగులకు తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడవచ్చు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. హనుమాన్ చాలీసా పారాయణ మంచిది.

Also Read: వాస్తు ప్రకారం ఈ 7 వస్తువులను పొరపాటున కూడా కింద పడేయకూడదు

కన్య:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో స్థిరమైన బుద్ధఇతో వ్యవహరించాలి. వ్యాపారంలో ఊహించని లాభాలు వరిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో కొత్త పనులు చేపడతారు. అనుకున్న సమయంలో ఇతరుల నుంచి సహాయం పొందుతారు. పెద్దల ఆశీస్సులు పనిచేస్తాయి. శివారాధన శుభకరం.

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో పెండింగ్ సమస్యలు తొలగిపోతాయి. ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు అప్పగించిన పనులు నెరవేరుస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

వృశ్చికం:
వృశ్చికరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో శుభవార్త వింటారు. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండడం మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వాదనలతో సమయాన్ని వృథా చేస్తారు. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శన మంచిది.

ధనుస్సు:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో సమస్యలు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికపరంగా ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇతరులతో వాదనలకు దిగవద్దు. నవగ్రహ శ్లలోకాలు పఠిస్తే పరిస్థితులు మెరుగుపడతాయి.

మకరం:
మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆదాయాన్ని మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త భూములను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్ర పారాయణం శుభప్రదం.

కుంభం:
ఈ రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆర్థిక లాభాలు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగులకు అప్పగించిన పనులు విజయవంతంగా అమలు చేస్తారు. తద్వారా సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఊహించని ధనలాభం ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

మీనం:
మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన విషయాల్లో తోటి వారి సహకారంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఈశ్వర ధ్యానం మేలు చేస్తుంది.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×