E-Paper
Advertisement

OTT Movie : సొంత కూతురిని రే*ప్ చేయించే తండ్రి… ఆమె గురించే పగ తీర్చుకోబోయి సరిదిద్దుకోలేని తప్పు

OTT Movie : సొంత కూతురిని రే*ప్ చేయించే తండ్రి… ఆమె గురించే పగ తీర్చుకోబోయి సరిదిద్దుకోలేని తప్పు
Advertisement

OTT Movie : ఓటిటిలో వందలాది సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అందులోనూ కొన్ని సినిమాలు మాత్రం ఒక్కసారి చూస్తే జీవితాంతం మర్చిపోలేమో అన్నట్టుగా ఉంటాయి. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. అయితే టైటిల్ ని చూసి బో*ల్డ్ మూవీ అనుకుంటున్నారేమో ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. తండ్రి కూతుర్ల అనుబంధంతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లను షేక్ చేసింది. తాజాగా ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. మరి ఈ మూవీ కథ ఏంటి? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

స్టోరీ లోకి వెళ్తే…

Advertisement

సినిమాలో తల్లి చనిపోవడంతో తండ్రీ కూతుర్లు మాత్రమే ఉంటారు. మొండిగా ఉండే తండ్రికి కూతురు అంటే మహా ఇష్టం. ఆమె ఏం చెప్పినా సరే చిన్న పిల్లాడిలా తలాడిస్తాడు ఆ తండ్రి. కూతురు లేకుండా ఒక్క నిమిషం కూడా బతకలేను అన్నంత ప్రేమగా చూసుకుంటాడు. పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లేకపోయినా కూతురే ప్రపంచం అన్నట్టుగా ఆ తండ్రి ఉంటే, తండ్రిని తల్లిలా చూసుకునే కూతురు స్టోరీ తో ఈ మూవీ నడుస్తుంది. అయితే ఓ రోజు పాప స్కూల్ ట్రిప్ కోసం వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళినప్పటి నుంచి ఇద్దరూ ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే కూతురు ఇంటికి వచ్చే టైంకి తండ్రి వేరే పనిలో బిజీగా ఉండి ఇంటికి త్వరగా రాలేకపోతాడు. అంతలోనే జరగరాని అఘాయిత్యం జరిగిపోతుంది. అయితే అసలు అక్కడ ఏం జరిగింది? చేసింది ఎవరు? అనే విషయాలను తెలుసుకోవడానికి ఆ తండ్రి కొత్త నాటకం మొదలు పెడతాడు. మరి చివరికి హీరో తన కూతురిపై అఘాయిత్యం చేసిన నిందితులు ఎవరు అన్నది కనిపెట్టాడా? ఆ అమ్మాయి బతికే ఉందా? ఇంతకీ ఇలాంటి దారుణమైన ఘాతకానికి ఒడిగట్టింది ఎవరు? ఎందుకు చేశారు? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

Advertisement

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ మరేదో కాదు తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజా’. జూలై 12 నుంచి ఈ మూవీ ఓటిటి లో తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ తమిళ మూవీ 100 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. తెలుగులో కూడా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటిటిలోకి అడుగు పెట్టింది. ఇక ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే హీరోగా విజయ్ సేతుపతికి ఇది 50వ సినిమా. ఈ స్టోరీని మ్యాజికల్ స్క్రీన్ ప్లే తో నడిపించింది డైరెక్టర్ నితిలన్ స్వామినాథన్. గ్రిప్పింగ్ స్టోరీ తో ప్రేక్షకులను కట్టి పడేసారు డైరెక్టర్. ఒకవేళ ఎవరైనా ఇంకా ఈ సినిమాను చూడకపోతే వెంటనే ఒక లుక్కెయ్యండి.

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×