Big Stories

House Sales : హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు అదుర్స్

House Sales : ఓవైపు ద్రవ్యోల్బణం, మరోవైపు వడ్డీ రేట్ల పెంపు, ఇంకోవైపు లే ఆఫ్ ప్రకటనలు భయపెడుతున్నా… హైదరాబాదీలు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. జంట నగరాల పరిధిలో నచ్చినచోట ప్రాపర్టీలను కొనేస్తున్నారు. ఇండిపెండెంట్ హౌస్ లతో పాటు… అపార్ట్ మెంట్లలో ఫ్లాట్ సేల్స్ కూడా… విలువ పరంగా భారీగా పెరిగాయని… ఓ సంస్థ నివేదికలో వెల్లడైంది.

- Advertisement -

హైదరాబాద్‌లో స్థలాలు, ఇళ్ల విలువలు భారీగా పెరుగుతున్నా… వాటి అమ్మకాలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో… దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో రెసిడెన్షియల్ హౌసింగ్ యూనిట్ల అమ్మకాలు గణనీయమైన వృద్ధి సాధించాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో… మొత్తం ఇళ్ల విక్రయ విలువలో 130 శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్ధిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో… నగరంలో రూ.6,926 కోట్ల విలువైన 9,980 యూనిట్లు విక్రయమయ్యాయి. అదే ప్రస్తుత ఫైనాన్షియల్‌ ఇయర్‌ తొలి ఆరు నెలల్లో నగరంలో రూ.15,958 కోట్ల విలువ చేసే 22,840 ఇళ్లు అమ్ముడుపోయాయి. ఏడాది కాలంలో హైదరాబాద్‌లో మొత్తం ఇళ్ల విక్రయ విలువలో 130 శాతం వృద్ధి రేటు నమోదైందని అనరాక్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ వెల్లడించింది.

- Advertisement -

దేశంలోని 7 ప్రధాన నగరాల్లో గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 87,375 యూనిట్లు అమ్ముడుపోగా… ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 1,73,155 యూనిట్లు అమ్ముడుపోయాయి. వీటి విలువ రూ.1.56 లక్షల కోట్లు. అంటే… గత ఏడాది తొలి ఆరు నెలలతో పోలిస్తే… అమ్ముడుపోయిన ఇళ్ల విలువ ఏకంగా రూ.71,295 కోట్లు పెరిగింది. అంటే ఏడాదిలో వృద్ధి రేటు 119 శాతం అన్నమాట. ముంబైలో అత్యధికంగా రూ.74,835 కోట్లు విలువ చేసే ఇళ్లు అమ్ముడుపోగా… ఆ తర్వాత ఢిల్లీ NCRలో రూ.24,374 కోట్లు, బెంగళూరులో రూ.17,651 కోట్లు విలువ చేసే గృహాలు విక్రయమయ్యాయి. గృహ విలువల వృద్ధి అత్యధికంగా ఢిల్లీ NCRలో నమోదైంది. గత ఆర్ధిక సంవత్సరం తొలి ఆరు నెల్లలో ఢిల్లీ NCRలో రూ.8,896 కోట్లు విలువ చేసే ఇళ్లు విక్రయం కాగా… ప్రస్తు ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 175 శాతం వృద్ధి రేటుతో ఇళ్ల అమ్మకం రూ.24,374 కోట్లకు చేరింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News