Big Stories

Moodys cuts Indias Growth : రెండోసారీ కోత పెట్టిన మూడీస్

Moodys cuts Indias Growth : భారత వృద్ధి రేటు అంచనాకు మూడీస్‌ మరోసారి కోత పెట్టింది. 7.7 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. ప్రపంచ మందగమనం, అధిక వడ్డీరేట్ల కారణంగా… భారత వృద్ధి రేటు తగ్గొచ్చని చెబుతోంది… రేటింగ్ దిగ్గజం మూడీస్.

- Advertisement -

ఈ ఏడాది మే నెలలో 2022లో భారత వృద్ధిని 8.8 శాతంగా అంచనావేసింది… మూడీస్‌. ఆ తర్వాత సెప్టెంబర్‌లో దాన్ని 7.7 శాతానికి తగ్గించింది. రెండు నెలలు గడవకముందే మరోసారి కోత నిర్ణయం తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ స్థూల ఆర్థిక అంశాల అవుట్‌లుక్‌ నివేదిక 2023–24లో వెల్లడించింది… మూడీస్. 2022లో భారత్‌ వృద్ధి రేటును 7.7 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అంతర్జాతీయ మందగమనం వంటి అంశాలు తాజా నిర్ణయానికి కారణమంటోంది… మూడీస్.

- Advertisement -

2021 క్యాలెండర్‌ ఇయర్‌లో భారత్‌ వృద్ధి 8.5 శాతమని మూడీస్‌ పేర్కొంది. బలహీన రూపాయి, అధిక చమురు ధరలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని కొనసాగిస్తాయని మూడీస్‌ అంచనా వేసింది. రాబోయే రెండేళ్లలోనూ అంతర్జాతీయ వృద్ధిలో జోరు తగ్గుతుందని చెబుతూ… 2023లో G20 దేశాల జీడీపీ 1.3 శాతం క్షీణిస్తుందని తెలిపింది. అంతకుముందు ప్రకటించిన 2.1 శాతం క్షీణ అంచనాలతో పోలిస్తే… మూడీస్ ఇప్పుడు కాస్త మెరుగైన గణాంకాలు వెల్లడించడం కాస్త ఊరట కలిగించే అంశం.

వచ్చే ఏడాది భారత వృద్ధి రేటు మరింత క్షీణించి 4.8 శాతానికి పడిపోతుందని ప్రకటించిన మూడీస్… 2024లో కాస్త మెరుగుపడి… వృద్ధి రేటు 6.4 శాతానికి చేరుతుందని వెల్లడించింది. మరోవైపు… తాజా ఆర్థిక పరిస్థితుల కారణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు పలు దేశీయ, అంతర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థిక, వాణిజ్య దిగ్గజ సంస్థలు… 2022–23లో భారత్‌ వృద్ధి అంచనాలకు ఇప్పటికే కోత పెట్టాయి. భారత వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 7.3 శాతం మధ్యలో నమోదుకావొచ్చని అంచనా వేశాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News