Big Stories

Loan Apps: వేధించే ”లోన్ యాప్‌”ల బారిన పడకుండా ఉండాలంటే…

లోన్ యాప్స్ ఆగడాలు భరించలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న, చేసుకుంటున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. తెలీసీ తెలియక లోన్ యాప్స్ నుంచి రుణాలు తీసుకుని… వాటికి అనేక రెట్లు తిరిగి చెల్లించలేక… తెలిసిన వాళ్లందరిలో పరువు తీస్తామనే వేధింపులు భరించలేక… చాలా మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇలాంటి లోన్ యాప్స్ బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలంటే…

- Advertisement -

ఏదైనా లోన్ యాప్‌లో అప్పు కోసం ప్రయత్నించినప్పుడు… అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్‌లైన్‌లోనే పూర్తవుతుంది. దీనికి ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన పని లేదు. అలాగే సెక్యూరిటీ డిపాజిట్, ఆస్తి తనఖా పెట్టడం వంటివి చేయాల్సిన పని లేదు. అవసరమైన డాక్యుమెంట్ల సాఫ్ట్ కాపీలను ఆన్‌లైన్‌లోనే సబ్‌మిట్ చేస్తే… లోన్ ప్రాసెస్ మొత్తం ఆన్‌లైన్లోనే 10 నుంచి 30 నిమిషాల్లో పూర్తవుతుంది. నో యువర్ కస్టమర్ ధృవీకరణ పూర్తై… అప్పు తీసుకోబోయే వ్యక్తికి అర్హత ఉంటే… ప్రాసెసింగ్ ఫీజులు, ఇన్సూరెన్స్ ఛార్జీలు లాంటివి పోను… మంజురైన రుణంలో మిగతా మొత్తం నేరుగా అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ రుణగ్రహీతకు అర్హత లేకపోతే… లోన్ రాదు.

- Advertisement -

అదే మోసపూరిత యాప్‌లైతే… కేవైసీ లాంటి నిబంధనలు ఏమీ పాటించకుండా… కేవలం కస్టమర్ల డేటా, ఫోటో, ఫోన్‌ నెంబర్‌ మాత్రం తీసుకుని రుణాలు ఇచ్చేస్తున్నాయి. ఆ తర్వాత వడ్డీల మీద వడ్డీలు వేసి డబ్బు గుంజాలని ప్రయత్నించడం, కట్టకపోతే వేధించడం వంటివి చేస్తున్నాయి. అందుకే… ఇలాంటి లోన్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కేవలం ఫోన్ నెంబర్, ఫోటో ద్వారా డబ్బులిచ్చేస్తామనే యాప్స్ జోలికి అసలు వెళ్లకపోవడం మంచింది. అంతేకాదు… అనధికారక మెసేజ్‌లను తెరవకపోవడం, లింక్‌లపై క్లిక్ చేయకుండా ఉండటం మరీ మంచింది. లోన్ తీసుకునే ముందు… ఆ NBFC, RBI రిజిస్టర్డ్ కంపెనీ ఔనా? కాదా? అన్నది కూడా నిర్ధారించుకోవాలి.

ఇంకొన్ని సంస్థలు మీకు భారీ మొత్తంలో ప్రీ అప్రూవ్డ్ లోన్ ఉందని… తమ దగ్గర వివరాలు నమోదు చేస్తే ఏయే కంపెనీల నుంచి లోన్ వస్తుందో చెబుతామని ఊరిస్తూ మెస్సేజ్ లు పంపుతుంటాయి. అంటే… ఇవి నేరుగా అప్పులిచ్చే సంస్థలు కాదన్నమాట. అప్పులిచ్చే వారికి, తీసుకునే వారికి మధ్యవర్తిగా ఉంటూ… కొంత సొమ్ము వసూలు చేస్తుంటాయి. కొన్ని సంస్థలైతే… సైనప్ కింద వెయ్యో, రెండు వేలో కడితేగానీ లోన్ ఆఫర్లు చూపించేందుకు నిరాకరిస్తుంటాయి. అలాంటి వాటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండటం మంచింది. ఎందుకంటే ఎంతో కొంత మొత్తం చెల్లింది సైనప్ అయ్యాక… మీరు రుణ అర్హత లేదని చెబితే… కట్టిన డబ్బు నష్టపోవడమే తప్ప ఉపయోగం ఏమీ ఉండదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News