BigTV English

Human DNA : సైన్స్‌కు అడ్డుపడుతున్న మనుషుల డీఎన్ఏ..

Human DNA : సైన్స్‌కు అడ్డుపడుతున్న మనుషుల డీఎన్ఏ..


Human DNA: ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మనిషికి సంబంధించే ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బీచ్‌లో, సముద్రంలో సైతం ఉంటాయని అన్నారు. అవి మరేదో కాదు మనుషుల డీఎన్ఏ. అయితే ఈ డీఎన్ఏ అనేది పలు దేశాల్లో గాలిలో సైతం ప్రయాణిస్తుందని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఒక మనిషి డీఎన్ఏ అనేది ఉండడం సైన్స్‌కు వరమా? లేదా శాపమా? అనే విషయాన్ని శాస్త్రవేత్తలు సైతం నిర్ధారించలేకపోతున్నారు.

మనిషి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు.. ఇలా ఎన్నో రకాలుగా వారి డీఎన్ఏ అనేది పలు ప్రాంతాల్లో నిలిచిపోతూ ఉంటుంది. ఇలా మనిషికి సంబంధించిన ఆనవాళ్లు దాదాపు ప్రతీచోట ఉంటాయి. ఫ్లోరిడా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం.. మనుషులు ఎక్కువ వెళ్లలేని దీవులు, శిఖరాల ఎత్తుల వద్ద కూడా డీఎన్ఏలు ఉంటాయని తెలిసింది. ఇది సైన్స్‌కు వరమే అయినా అప్పుడప్పుడు ఇదే శాస్త్రవేత్తలు పలుమార్లు ఇబ్బందుల్లో పడేస్తుందని చెప్తున్నారు.


డీఎన్ఏ అనేది మనిషి శరీరంలోని వ్యాధుల గురించి, వారి కుటుంబ వివరాల గురించి తెలిసేలా చేస్తుంది. ఇలా మనిషి గురించి ఎన్నో వివరాలు తెలుసుకోవడానికి డీఎన్ఏ సహాపడుతుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. డీఎన్ఏ అనేది ప్రతీచోట ఉండిపోవడం వల్ల ఒక క్రైమ్ సీన్‌ను స్టడీ చేయడానికి లేదా వేస్ట్‌వాటర్‌లో క్యాన్సర్ కారకాలను కనుక్కోవడానికి.. ఇలా పలు సందర్బాల్లో శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలకు ఇవి అడ్డుగా ఉంటాయని తెలిపారు. నీటిలో, గాలిలో సైతం డీఎన్ఏ అనేది ఉండడం ఒక రకంగా తమకు ఇబ్బంది కలిగిస్తుందని అన్నారు.

డీఎన్ఏ ద్వారా మనిషికి సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా కనుక్కోవచ్చు కాబట్టి దీనిని చాలా జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత అందరికీ ఉందని శాస్త్రవేత్తలు సూచించారు. కానీ పూర్తిగా ఈ బాధ్యత మన చేతిలో ఉండేది కాదని, మనిషి డీఎన్ఏ అనేది తుమ్మినా, దగ్గినా బయటికి వెళుతుంది కాబట్టి దానిని ఆపడం కష్టమని మరికొందరు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇతర దేశాలకంటే ఫ్లోరిడాలో ఎక్కడ పడితే అక్కడ మనిషి డీఎన్ఏ ఉండడం శాస్త్రవేత్తలు పలు పరిశోధనల విషయంలో అడ్డుపడుతుందని తెలుస్తోంది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×