BigTV English

Love Signs: ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతుంటే వారిలో మీకు ఈ ఐదు లక్షణాలు కనిపిస్తాయి, మనస్తత్వశాస్త్రం చెబుతున్నది ఇదే

Love Signs: ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతుంటే వారిలో మీకు ఈ ఐదు లక్షణాలు కనిపిస్తాయి, మనస్తత్వశాస్త్రం చెబుతున్నది ఇదే

Love Signs: మనిషికి ఎదుటి మనిషిపై ఎప్పుడైనా ఇష్టం కలగవచ్చు. కొంతమంది దాన్ని బయటకు చెప్పగలరు, మరి కొందరు రహస్యంగా ఉంచుకుంటారు. మనస్తత్వశాస్త్రం ప్రకారం వ్యక్తుల ప్రవర్తన, వారి శరీర భాషను బట్టి ఎదుటివారిని ఇష్టపడుతున్నారో లేదో అంచనా వేయవచ్చు. మీకు ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతున్నారో లేదో తెలుసుకోవాలంటే వారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయేమో గమనించండి.


 అదే పనిగా మిమ్మల్నే చూస్తుంటే..

ఎవరైనా మిమ్మల్ని తరుచుగా చూడడం, మిమ్మల్ని గమనించడం చేస్తూ ఉంటే… వారు మీపై ఇష్టాన్ని కలిగి ఉన్నారని, మీ వైపు ఆకర్షితులయ్యారని అర్థం. మిమ్మల్ని చూశాక వెంటనే మీరు గమనించక ముందే చూపు తిప్పుకోవడం, పదేపదే మిమ్మల్ని చూడడం వంటివి వారు ఇష్టపడుతున్నారని చెప్పే ముఖ్యమైన సంకేతాలు. అలాగే మీతో మాట్లాడటానికి సిగ్గు పడుతున్నారని కూడా అర్థం చేసుకోవాలి. మీతో సంభాషణ ప్రారంభించడానికి వారు ప్రయత్నిస్తున్నారని తెలుసుకోండి.


వారి బాడీ లాంగ్వేజ్‌ను గమనించండి

ఎవరైనా మీపై ఇష్టాన్ని కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవడం కోసం వారి బాడీ లాంగ్వేజ్ ని గమనించండి. మిమ్మల్ని చూసి నవ్వడం, మీతో మాట్లాడుతున్నప్పుడు కాస్త వినమ్రంగా వంగి మాట్లాడడం వంటివి వారు మిమ్మల్ని విపరీతంగా గౌరవిస్తున్నారని, ఇష్టపడుతున్నారని అర్థం.

మీరు ఎవరితోనైనా మాట్లాడుతుంటే..

ఎవరైనా మీతో అతిగా మాట్లాడుతున్నా, మీ చుట్టూ తిరుగుతున్నా వారు చాలా ఆందోళనగా కనిపిస్తారు. మీకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. మీ కంటికి కనిపించేలాగే ఉండేందుకు ఇష్టపడతారు. ఈ లక్షణాలను కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారని చెప్పడమే.

అవసరం లేకున్నా మాటలు కలుపుతుంటే..

మీతో మాట్లాడేందుకు అవకాశాలను వెతుక్కుంటారు. అవసరం లేకపోయినా వచ్చి మాట కలుపుతూ ఉంటారు. అధిక శ్రద్ధను చూపిస్తారు. మిమ్మల్ని ఆకట్టుకోవడానికి పిచ్చి జోకులు వేస్తూ ఉంటారు. మీతో సంభాషణ ప్రారంభించడానికి లేదా కొనసాగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వారికి మీపై అదనపు ఇష్టం ఉందని సూచించేదే.

Also Read:  ఎక్కువ సేపు కూర్చొని పనిచేస్తే ఆరోగ్య సమస్యలు.. ఇదే పరిష్కారం..

అసూయ ఫీలవుతుంటే..

మీరు ఇతరులతో అతిగా మాట్లాడినా, చనువుగా ప్రవర్తించినా… వారు చాలా అసూయ పొందుతారు. మీరు వేరే వ్యక్తులను వారి ఎదుట అభినందించినా కూడా భరించలేరు, ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మీపై వారికున్న ఇష్టానికి సంకేతాలే.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×