Inaya Sultana : బిగ్ బాస్ ద్వారా చాలా మంది సెలబ్రిటీలు అయిపోయారు. కొందరు సినిమాల్లో బిజీగా ఉంటే, మరికొందరు సీరియల్స్లలో బిజీగా ఉంటున్నారు. అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న వారిలో ఇనయా సుల్తానా ఒకటి. బిగ్ బాస్ సీజన్ 6లో పార్టిసిపేట్ చేసింది బ్యూటిఫుల్ కంటెస్టెంట్.. ఆ తర్వాత అడపాదడపా సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఇనయా సుల్తానా ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జిమ్ లో గంటలు తరబడి కష్టపడుతూ ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తోంది. తాజాగా ఈమె షాపింగ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది.. ఆ పిక్స్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి..
షాపింగ్ మాల్ లో ఇనయా రచ్చ..
రీల్స్, యూట్యూబ్ వీడియోలతో బాగా పాపులర్ అయిన ఇనయా.. అదే క్రేజ్ తో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అనుకున్న బిజీ అవ్వలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. ఈమె పోస్ట్ చేసే ఫోటోలు గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోయిన్లను మించిన అందంతో హాట్ డ్రస్సులతో యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో రూటు మార్చి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో ఫోటోలను షేర్ చేసింది. షాపింగ్ ట్రాలి పై కూర్చొని ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. శ్రీ అరులోకం కొప్పిశెట్టి చక్రధర నాయుడు అలియాస్ గౌతమ్ కొప్పిశెట్టితో ప్రేమాయణం నడిపిస్తూ.. బెడ్ రూం ఫొటోలను కూడా వదిలి అప్పట్లో అరాచకం సృష్టించింది ఇనాయా.. మొన్నీమధ్య కాయలు ఆరోగ్యానికి మంచిది అని జామ కాయలు తింటున్న ఫోటోలను షేర్ చేసింది.. వాటికి నెటిజన్లు భిన్నంగా స్పందించారు. నెటిజెన్స్ కి ఆమె చెప్పిన సమాధానం కొందరిని బాగా ఆకట్టుకుంది. ఆ ఫోటోలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.
Also Read : కళ్లు చెదిరే ధరకు ‘రాజా సాబ్’ నాన్ థియేట్రికల్ రైట్స్.. రిలీజ్‌కు ముందే లాభాలు..!!
సినిమాల విషయానికొస్తే..
ఇనయా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, ఎక్స్‌ప్రెషన్స్ తో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది. బిగ్ బాస్ తర్వాత ఆమెకు అవకాశాల వేట మొదలైంది. కొన్ని చిన్నచిన్న సినిమాల్లో నటించినా, ఆమె అభిమానులు ప్రతి ప్రాజెక్ట్‌ని కూడా బాగా ఫాలో అయ్యారు. అలాంటి ఇనయా నటించిన తాజా చిత్రం ‘నటరత్నాలు’.. గత ఏడాది రిలీజ్ అయ్యింది.. ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇటీవల విడుదలైన భైరవం సినిమాలో ఇనయా సుల్తానా నటించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘జాట్’ లోనూ కనిపించింది. అంతేకాదు మరి కొన్ని సినిమాలు కూడా చేస్తుంది. ఒకవైపు చిన్నగా సినిమాల్లో బిజీ అవుతున్నా కూడా సోషల్ మీడియాలో అంతకు మించి హాట్ అందాల తో రెచ్చ గొడుతుంది.