BigTV English

Electric Vehicles : పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల తయారీ.. అదొక్కటే ఇబ్బంది..!

Electric Vehicles : పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల తయారీ.. అదొక్కటే ఇబ్బంది..!
Electric Vehicles


Electric Vehicles : ఒకప్పుడు కస్టమర్లు చిన్న కారు ఉంటే చాలు అనుకునేవారు. ఆ తర్వాత మెల్లగా కార్లలోని ఫీచర్స్ చూడడం మొదలుపెట్టారు. ఆపై కార్లలో తమకు నచ్చిన ఫీచర్స్ ఉంటేనే కొనడం మొదలుపెట్టారు. ఫ్ల్యూయల్ నుండి ఆటోమేటిక్ కార్లకు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా ఎలక్ట్రిక్ కార్లపైనే తమ ఇష్టాన్ని పెంచుకుంటున్నారు. కానీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ పెరగడం వల్ల అందులో కొన్ని సమస్యలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.

ఎలక్ట్రిక్ కార్లు అనేవి 2022లో పూర్తిస్థాయిలో మార్కెట్లోకి ఎంటర్ అయ్యాయి. అప్పటి నుండి వీటి సేల్స్ శాతం ఎప్పుడూ పడిపోలేదు. అందుకే గతేడాది కంటే ఈ సంవత్సరం ఎలక్ట్రిక్ కార్ సేల్స్ 35 శాతం పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో పెద్ద ఛాలెంజ్‌గా మారే విషయం రీసైక్లింగ్. మామూలుగా ఫ్ల్యూయల్ కార్లను రీసైకిల్ చేయడం, స్క్రాప్‌లాగా మార్చడం సులభం. కానీ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో అదంతా సులభం కాదు.


ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను రీసైకిల్ చేయాలంటే దానికి చాలా ప్రక్రియ ఉంటుంది. దానంతటి కోసం ఎంతో ఖర్చు కూడా అవుతుంది అని నిపుణులు చెప్తున్నారు. మామూలుగా ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో కొత్త బ్యాటరీలను తయారు చేయడం కంటే పాతవి రీసైకిల్ చేయడమే కష్టమని అంటున్నారు. అంతే కాకుండా ఈ బ్యాటరీలు అనేవి త్వరగా పాడయిపోయే అవకాశం ఉంటుందని, దాని వల్ల బ్యాటరీలు ఎక్కువగా తయారు చేయాల్సిన అవసరం ఉంటుందని, దానికోసం లేబర్, ఫైనాన్స్.. ఇలా అన్ని మళ్లీ డబుల్ ఖర్చులుగా మారుతాయని నిపుణులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో పెరుగుతున్న టెక్నాలజీ సాయంతో ఈవీ బ్యాటరీలను రీసైకిల్ చేసే పద్ధతిలో మార్పులు తీసుకురావచ్చని నిపుణులు భావిస్తున్నా.. దానికి చాలా సమయం పడుతుందని మరికొందరు విమర్శిస్తున్నారు. శాస్త్రవేత్తలు ఈ పనిలో పూర్తిగా నిమగ్నయి ఉంటేనే దీనికి ఒక పరిష్కారం అందుతుందన్నారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మేజర్‌గా మారుతుండడంతో రీసైక్లింగ్ విషయంలో త్వరగా నిర్ణయాలు తీసుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×