E-Paper
Advertisement

New Pension Scheme: పెళ్లి కాకపోతే పెన్షన్.. సర్కారు కొత్త స్కీమ్!

New Pension Scheme: పెళ్లి కాకపోతే పెన్షన్.. సర్కారు కొత్త స్కీమ్!
Advertisement
youth

New Pension Scheme: ఓట్ల కోసం ఎన్ని పాట్లైనా పడతాయి పార్టీలు. ఓటరు దేవుళ్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలా అని నిత్యం పరితపిస్తుంటాయి. అందుకోసం, రకరకాల స్కీములతో బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తుంటాయి. తాజాగా, మరో వెరైటీ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది సర్కారు. సీఎం ప్రకటించిన ఆ కొత్త పెన్షన్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. వారెవా.. ఇలాంటి పెన్షన్లు కూడా ఇస్తారా? అంటూ పండుగ చేసుకుంటున్నారు పెళ్లికాని ప్రసాదులు.

అవును, పెళ్లికాని వారికి ఇకపై నెల నెలా పెన్షన్ ఉవ్వాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, బ్యాచిలర్స్ అందరికీ పింఛన్ ఇవ్వరట. కొందరికేనట. టర్మ్స్ అండ్ కండీషన్స్ అప్లై అంటున్నారు సీఎం.

Advertisement

45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న పెళ్లి కాని వారికి మాత్రమే పెన్షన్ ఇచ్చేలా కొత్త పథకం ప్రవేశపెట్టబోతోంది హర్యాణా ప్రభుత్వం. మరో నెలలోనే ఈ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని స్వయంగా ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌. అబ్బాయిలకే కాదు.. 45 ఏళ్లు నిండిన పెళ్లి కాని మహిళలకూ ఈ స్కీమ్ అప్లై అవుతుందని చెప్పారు. అయితే, ఆ పెన్షన్ ఎంత ఇస్తారనే వివరాలు మాత్రం లీక్ చేయలేదు.

మరి, 60 ఏళ్లు నిండిన వారి పరిస్థితి ఏంటి? అనే అనుమానం రావొచ్చు. వారికి వృద్ధాప్య పింఛను ఉందిగా అంటున్నారు. ఆ మొత్తాన్ని కూడా త్వరలోనే 3వేలకు పెంచనున్నట్టు సీఎం ఖట్టర్ చెప్పారు.

Advertisement

వృద్ధాప్య పెన్షన్, వితంతు పింఛన్, వికలాంగులు, రైతుల పెన్షన్.. ఇలాంటివి అనేక రకాల పథకాలు చూశాం కానీ.. ఇప్పుడు కొత్తగా ఈ పెళ్లికాని వారికి పెన్షన్ ఇవ్వడం ఏంటంటూ.. సోషల్ మీడియాలో విమర్శలూ, జోకులూ పేలుతున్నాయి.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

Big Stories

Advertisement
×