BigTV English

Infections : మెడికల్ పరికరాల వల్ల కూడా ఇన్ఫెక్షన్స్..

Infections : మెడికల్ పరికరాల వల్ల కూడా ఇన్ఫెక్షన్స్..
Infections

Infections : ఇమ్యూన్ పవర్ ఎక్కువలేని వారు ఎక్కువగా రోగాల బారినపడుతుంటారు. మరికొందరు తాము ఆరోగ్యంగా ఉన్నా కూడా తమకు ఏదో సమస్య ఉందని అనుకుంటూ భయపడుతూ ఉంటారు. ఇలాంటి వారు అమెరికాలో ఎక్కువగా ఉంటారని సర్వేలో తేలింది. అయితే ఆరోగ్య సమస్యల గురించి ఆసుపత్రిల వెంట తిరగడం కూడా అంత మంచిది కాదని తాజాగా చేసిన పరిశోధనల్లో తేలింది. అవి కొందరిని ఇన్ఫెక్షన్స్ బారినపడేస్తాయని తెలుస్తోంది.


అమెరికన్లు ఏడాదికి 33.4 మిలియన్ల సార్లు ఆసుపత్రిలో అడ్మిట్ అవుతారు. ఒక బిలియన్ సార్లు డాక్టర్లను కలుస్తుంటారు. అయితే ఆసుపత్రిలో ఉపయోగించే ప్రతీ మెడికల్ పరికరం శుభ్రంగా, క్రిమిరహితంగా ఉండాలి. రక్తపరీక్ష కోసం సూదులు గానీ, సర్జరీకి ఉపయోగించే టూల్స్ గానీ క్రిములకు దూరంగా, పరిశుభ్రంగా ఉండాలి. ఒకవేళ ఇవి పరిశుభ్రంగా లేకపోతే.. ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్స్‌కు దారితీస్తాయి. ఆసుపత్రి అంటేనే వ్యాధులతో నిండిపోయి ఉంటుంది. అలాంటి సమయంలో ఇన్ఫెక్షన్స్ అంటే పరిణామాలు మరీ దారుణంగా ఉంటాయి. అలాంటప్పుడే ఎథిలిన్ ఆక్సైడ్ రంగంలోకి దిగుతుంది.

ఎథిలిన్ ఆక్సైడ్ గ్యాస్ (ఈటో) అనేది మెడికల్ పరికరాలను శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. అమెరికాలో ప్రతీ సంవత్సరం ఈటో సాయంతో 20 బిలియన్ మెడికల్ పరికరాలను శుభ్రపరుస్తారు. మెడికల్ పరికరాలు శుభ్రం చేయడానికి మరెన్నో పద్ధతులు కూడా ఉన్నాయి. కానీ వాటన్నింటికంటే ఎథిలిన్ ఆక్సైడ్ గ్యాస్ మెరుగ్గా పనిచేస్తుంది. ఈ విషయాన్ని నిరూపించడానికి అనేక ఆధారాలు కూడా ఉన్నాయి. ఎన్నో విధాలుగా ఎథిలిన్ ఆక్సైడ్ స్టెరిలైజేషన్ మెడికల్ పరికరాలను కాపాడుతుంది.


ఎథిలిన్ ఆక్సైడ్ అనేది మెడికల్ పరికరాలను స్టెరిలైజ్ చేయడానికి ఉపయోగపడుతుందని తెలిసిన విషయమే. కానీ తాజాగా దీని వల్ల కలిగే పరిణామాలు చర్చనీయాంశం అయ్యాయి. ఎటో ఎమిషన్స్ వల్ల క్యాన్సర్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కొందరు వాదన మొదలుపెట్టారు. అయితే ఎటో అనేది పరిసర ప్రాంతాలకు ముప్పు కలిగిస్తుంది కానీ అది ఎక్కువశాతం కాదు అని మరికొందరి వాదన. కానీ ఎథిలిన్ లేకపోతే మెడికల్ పరికరాల స్టెరిలైజేషన్ సరిగ్గా జరగదని అందుకే దీని వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయో పూర్తిస్థాయిలో గమనించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×