BigTV English

Pakistan: గోధుమ పిండికోసం తొక్కిసలాట.. పాక్‌లో 11 మంది దుర్మరణం

Pakistan: గోధుమ పిండికోసం తొక్కిసలాట.. పాక్‌లో 11 మంది దుర్మరణం

Pakistan: ఆర్థిక సంక్షోభంతో అల్లకల్లోలం అవుతుంది పాకిస్థాన్. తినడానికి తిండిలేక.. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి జనాలు అల్లాడిపోతున్నారు. కనీస అవసరాలు తీర్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. ఈక్రమంలో అక్కడి ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా గోధమ పిండి పంపిణీ చేస్తండగా.. తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు.


ఆకలితో అలమటిస్తున్న జనాలకు ఉచితంగా గోధుమ పిండి పంపిణీ చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలో గోధుమ పిండి లోడ్‌తో కూడిన లారీని పంజాబ్ ప్రావిన్స్‌కు పంపించింది. అయితే జనాలు ఒక్కసారిగా ఆ లారీపైకి ఎగబడ్డారు. రన్నింగ్ ఉన్న లారీ ఎక్కి గోధుమ పిండి బస్తాలను తీసుకునేందుకు ప్రయత్నించారు.

ఈక్రమంలో తొక్కిసలాట జరిగి దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయపడ్డారు. పంజాబ్ ప్రావిన్స్‌తో పాటు ముజఫర్‌గఢ్, ఒఖారా, జెహానియాన్, ఫైసలాబాద్ ప్రాంతాల్లో కూడా తొక్కిసలాట చోటుచేసుకుంది. గాయపడిని వారికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తొక్కిసలాటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైలరవుతున్నాయి.


Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×