Big Stories

Iran Agriculture:వ్యవసాయంపై ఫోకస్ పెట్టిన ఇరాన్.. అదే ప్లాన్..!

Iran Agriculture:గత కొన్నేళ్లలో వ్యవసాయ రంగంలో టెక్నాలజీ సాయం ఎంతో పెరిగింది. ఇంతకు ముందులాగా రైతులు ఎక్కువగా కష్టపడకుండా ఉండేలా శాస్త్రవేత్తలు ఎన్నో టెక్నికల్ పరికరాలను తయారు చేసి వారికి అందించారు. అయితే ఇది సరిపోదని రైతులకు ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించే బాధ్యత టెక్ నిపుణులకు ఉందని కేంద్రం.. వారికి పెద్ద బాధ్యతే అప్పగించింది.

- Advertisement -

ఇప్పటికీ వ్యవసాయంలో దాదాపు 260 సమస్యలు ఉన్నాయని, అవన్నీ తీర్చే బాధ్యత టెక్నాలజీ కంపెనీలకు ఉందని ఇరాన్ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. అంతే కాకుండా వ్యవసాయ రంగంలో పెరుగుతున్న టెక్నాలజీ గురించి విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు పాఠాలుగా చెప్పాలని, అంతే కాకుండా థీసిస్‌లో కూడా చేర్చాలని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. ఈరోజుల్లో సరిపడా మోడర్న్ టెక్నాలజీ లేకుండా ఆరోగ్యకరమైన ఆహారం పొందడం కష్టమే అని వారు భావిస్తున్నారు.

- Advertisement -

ఈ ఏడాది అగ్రికల్చర్ మినిస్ట్రీ ఎన్నో కొత్త అధ్యాయనాలను ప్రారంభించింది. ఇరాన్‌లోనే మొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్‌కు శ్రీకారం చుట్టింది. అంతే కాకుండా దాదాపు ఆరు టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ విలేజ్‌లను దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రారంభించింది. వచ్చే ఏడాది వరకు ఇలాంటి 10 విలేజ్‌లను అదనంగా ప్రారంభించాలనే ఆలోచన ఉందని మంత్రి తెలిపారు.

ఇప్పటికే వ్యవసాయ రంగంలో పనిచేసే టెక్నాలజీ కంపెనీల సంఖ్య 280 నుండి 480కు పెరిగిందని ఇరాన్ వ్యవసాయ శాఖ మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ కంపెనీల షేర్‌ను 4.2 శాతం నుండి 6.5 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వ్యవసాయ రంగంలో గ్రోత్ సెంటర్లు కూడా 18 శాతం పెరిగాయని బయటపెట్టారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, సైన్స్ సాయం లేకుండా అది సాధ్యం కాదని తెలిపారు.

ప్రస్తుతం వ్యవసాయం కోసం సైన్స్ అండ్ టెక్నాలజీలో 7882 కంపెనీలు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నో కొత్త విధానాలతో వ్యవసాయంలో సైన్స్ అండ్ టెక్నాలజీని మరింత పెంచాలని ఇరాన్ భావిస్తున్నట్టుగా సమాచారం. అంతే కాకుండా వ్యవసాయంలో పెరుగుతున్న టెక్నాలజీ వల్ల ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి వారు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News