Big Stories

Used Cooking Oil : వాడిన వంట నూనె మళ్లీ వాడితే ప్రమాదమా?

Used Cooking Oil : సాధారణంగా ఇంట్లో పిండివంటలు చేశాక నూనె మిగులుతుంది. దాన్ని కొందరు కూరలు తాలింపు వేసేందుకు వినియోగిస్తుంటారు. మరికొందరు వాడిన నూనెనే తిరిగి వాడుతుంటారు. దీంతో ప్రాణాలకే ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. డీప్‌ ప్రైకు వాడిన నూనెను తిరిగి వాడితే ఆరోగ్యానికి ఎంతో హాని జరుగుతుందని చెబుతున్నారు. ఒకసారి వాడిన నూనెను దాదాపు 60 శాతం మళ్లీ వంట కోసం వాడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఆహార భద్రతా ప్రమాణాల మేరకు ఒకసారి వినియోగించిన వంట నూనెను తిరిగి ఏ రకంగానూ వాడటం పూర్తిగా నిశేధం. టోటల్‌ పొలార్‌ కాంపౌండ్స్‌ స్థాయి 25 శాతానికి చేరుకోగానే ఆ వంట నూనె మార్చాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టంగా చెప్పింది. అలా చేయకపోతే రక్త నాళాలు గట్టిపడటం, అల్జీమర్స్‌, కాలేయ సంబంధ వ్యాధులు, హైపర్‌టెన్షన్‌లాంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తోంది. ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ వాడితే అది ఫ్రీరాడికల్స్‌ను సృష్టిస్తుంది. ఈ ఫ్రీరాడికల్స్‌ ప్రమాదకర వ్యాధులకు కారణం అవుతాయి. క్యాన్సర్, ధమనులు బ్లాక్, ఎథెరోస్క్లెరోసిస్‌లాంటి వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. నూనెను ఒకసారి వాడితే అందులోని పోషకాలు మనం వాడుకున్నట్లే. మళ్లీ ఆ నూనె వేడి చేస్తే చెడు కొలెస్ట్రాల్‌గా తయారవుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ గుండెకు హానికరం. రెండోసారి వాడిన నూనెతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకుంటే గుండెజబ్బులే కాకుండా ఉదరకోశ, అన్నవాహిక క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఆ నూనె వల్ల ఆహారం పాయిజన్‌గా అవుతుంది. దీంతో కడుపులో మంట, కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వాడిన నూనెతో కరెంటు పోయినప్పుడు దీపాలు వెలిగించుకోవచ్చు. కాగితానికి ఈ వాడిన నూనె రాసి పురుగులు వచ్చే చోట వేలాడదీస్తే దానికి అతుక్కుంటాయి. లెదర్‌ బ్యాగులు, ఇతర వస్తువులను ఈ నూనెతో తుడిస్తే స్మూత్‌గా మారతాయి. ఈ నూనెలో కొంచెం వెనిగర్‌ కలిపి ఫర్నిచర్‌ను తుడిస్తే కొత్త వాటిలా మెరుస్తాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News