BigTV English

Naga Chaitanya : ఇదేక్కడి తలనొప్పి… మూవీకి తండేల్ రాజే మైనసా..?

Naga Chaitanya : ఇదేక్కడి తలనొప్పి… మూవీకి తండేల్ రాజే మైనసా..?

Naga Chaitanya : టైటిల్ చూసిన తర్వాత… తండేల్ రాజే సినిమాకు మైనస్ అని అంటున్నారు ఏంటి అని ఆలోచిస్తున్నారా..? అవును పైన మీరు చూసిన టైటిల్ నిజమే. అయితే తండేల్ రాజు అంటే.. నిజ జీవితంలో తండేల్ రాజు కాదు. తండేల్ మూవీలో ఆ పాత్ర చేస్తున్న నాగ చైతన్య.


అవును.. ఇప్పుడు అదే టాక్ నడుస్తుంది ఇండస్ట్రీలో… సినిమాకు ప్లస్ అనుకునే హీరోనే మైనస్ అవుతున్నాడా..? అనే టాక్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. మరి అది ఏంటో ఇప్పుడు చూద్దాం…

అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తండేల్ మూవీకి మరో మూడు రోజులు మాత్రమే ఉంది. ఫిబ్రవరి 7వ తేదీన వరల్డ్ వైడ్ ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి తెగ చర్చ జరుగుతుంది. అలాగే కొంత మంది ఈ తండేల్ మూవీ చూసిన తర్వాత అందులో ఉన్న విషయాలను బయటికి చెబుతున్నారు. అవి కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.


దీని ప్రకారం… సినిమాలో తండేల్ రాజు అనే పాత్రను నాగ చైతన్య చేస్తున్న సంగతి తెలిసిందే. పక్కా శ్రీకాకుళం ఏరియాకు చేందిన సినిమా ఇది. తండేల్ రాజు పాత్రకు కూడా పక్కా శ్రీకాకుళం జిల్లా అతను. అంతే కాదు… మృత్సకారుడు కూడా. ఇప్పుడు నాగ చైతన్య శ్రీకాకుళం యాసలోనే మాట్లాడాలి. అలాగే మృత్సకారుడిలా ఉండాలి. అది నిజానికి పెద్ద సవాల్‌తో కూడిన పని. శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ… మృత్సకారుడిలా బాడీ లాంగ్వేజ్ సెట్ చేయడం అంటే… మామూలు విషయం కాదు. ఇదే ఇప్పుడు తలనొప్పిగా మారిందట.

అవును… నాగ చైతన్యకు శ్రీకాకుళం యాస అసలు సెట్ అవ్వలేదట. అంతే కాదు… మృత్సకారుడిలా కూడా బాడీ లాంగ్వేజ్ చైతన్యకు సెట్ అవ్వలేదని సమాచారం.

ప్రత్యేక శిక్షణ లేదు…

నిజానికి హీరోలు ఇలాంటి పాత్రలు చేసే టైంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. స్లాంగ్ కోసం, బాడీ లాంగ్వేజ్ కోసం నిపుణల పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటారు. కొద్ది రోజులు అదే ప్రాంతంలో ఉంటారు. అక్కడి ప్రజలతోనే ఉంటారు. కానీ, నాగ చైతన్య మాత్రం అలా చేయలేదు.

కొద్ది రోజుల పాటు శ్రీకాకుళంలో ఉన్నారు. కానీ, స్లాంగ్ కోసం గానీ, బాడీ లాంగ్వేజ్ కోసం కానీ, ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ సినిమాపై పడిందట.

బన్నీని చూసి నేర్చుకోవాలి…

అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో పుష్ప పార్ట్ 1 టైంలో చిత్తూరు స్లాంగ్, ఆ బాడీ లాంగ్వేజ్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. చిత్తూరు యాస రావడానికి బన్నీ అప్పట్లో చాలా కష్టపడ్డాడు. అందుకే పుష్ప పార్ట్ 1 కానీ, లేటెస్ట్ పుష్ప 2 కి గానీ, అంత మంచి కలెక్షన్లు వచ్చాయి. పైగా చిత్తూరు స్లాంగ్ గురించి ఈ రెండు సినిమాల్లో ఒక్క చిన్న కంప్లైట్ కూడా రాలేదు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×