KKR VS RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ( Rajasthan Royals vs Kolkata Knight Riders) మధ్య… ఆరవ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ గౌహతిలోని బర్శపార క్రికెట్ స్టేడియంలో… జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు.. బౌలింగ్ ఎంచుకుంది. అయితే.. బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్… రాజస్థాన్ రాయల్స్ జట్టును కట్టడి చేసింది. భారీ స్కోర్ చేయకుండా అద్భుతంగా కేకేఆర్ బౌలర్లు బౌలింగ్ చేయడం జరిగింది.
Also Read: Mohammad Siraj: సిరాజ్ మామూలోడు కాదు.. మరో కొత్త అమ్మాయితో డేటింగ్..!
ఈ తరుణంలోనే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన రాజస్థాన్ రాయల్స్ కేవలం 151 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ రాయల్స్ తోపు ప్లేయర్ లందరూ అట్టర్ ప్లాప్ అయ్యారు. మొన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పైన అద్భుతంగా ఆడిన రాజస్థాన్ రాయల్స్… ఇవాల్టి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపించలేదు. యశస్వి జైస్వాల్ మరోసారి విఫలమయ్యాడు. 24 బంతుల్లో 29 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ రెండు సిక్సర్లు అలాగే రెండు బౌండరీలు కొట్టాడు.
అలాగే సంజు శాంసన్ 11 బంతుల్లో 13 పరుగులు చేశాడు. ఇందులో రెండు బౌండరీలు కూడా ఉన్నాయి. అటు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్.. కూడా భారీ ఇన్నింగ్స్ ఆడ లేకపోయాడు. 15 బంతుల్లో 25 పరుగులు చేసిన రియాన్ పరాగ్ మూడు సిక్సర్లు కొట్టాడు. కానీ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో డికాక్ కు క్యాచ్ ఇచ్చి ఇవ్వని తిరిగాడు. ఆ తర్వాత వచ్చిన నితీష్ రానా కూడా 9 బంతుల్లో 8 పరుగులు చేసి దారుణంగా విఫలమయ్యాడు. మోయిన్ అలీ బౌలింగ్లో క్లీన్ బోల్డ్ అయ్యాడు నితీష్ రానా.
Also Read: Most Ducks In IPL: డకౌట్ లో కూడా మ్యాక్సీ మామ రికార్డ్… టాప్ లో ఉన్న 5 గురు ప్లేయర్లు వీళ్లే !
ఆ తర్వాత వచ్చిన హవిందు హసరంగా… పేలవ ప్రదర్శన కనబరిచాడు. నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. అలాగే దృవ్ జూరెల్ కాస్త టచ్ లోకి వచ్చే ప్రయత్నం చేశాడు. 28 బంతుల్లో 33 పరుగులు చేసిన జురెల్.. ఐదు బౌండరీలతో రెచ్చిపోయాడు. కానీ భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యాడు జూరెల్. చివర్లో జోఫ్రా ఆర్చర్ 7 బంతుల్లో 16 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు కూడా ఉన్నాయి. ఇక కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు బౌలర్ల విషయానికి వస్తే.. స్పెన్సర్ జాన్సన్ నాలుగు ఓవర్లు వేసి ఒకే ఒక వికెట్ తీశాడు. అలాగే వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, హర్షిత్ రానా, అలాగే వైభవ్ అరోరా… నలుగురు బౌలర్లు కూడా మంచి పర్ఫామెన్స్ చూపించారు. అదే సమయంలో ఈ నలుగురు బౌలర్లకు వరుసగా రెండు వికెట్లను చొప్పున సాధించారు. ఇక ఇవాల్టి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన కోల్కత్తా నైట్ రైడర్స్ విజయం సాధించాలంటే 152 పరుగులు చేయాల్సి ఉంటుంది.