Big Stories

Battery car : లిథియంకు ప్రత్యామ్నాయం దొరికిందోచ్!

JAC Auto launched sodium ion battery car

ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్ ఫోన్లు… ఏవి తీసుకున్నా లిథియం-అయాన్ బ్యాటరీతో తయారైనవే. ఇన్నాళ్లూ దీనికి ప్రత్యామ్నాయం లేదు. అంతేకాదు… ఈవీలు, స్మార్ట్ ఫోన్ల మార్కెట్ విస్తృతంగా పెరిగిపోవడంతో… లిథియం ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. దాంతో… ఎప్పటికప్పుడు ఈవీలు, స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా పైపైకి దూసుకెళ్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లిథియం-అయాన్ బ్యాటరీలకు ప్రత్యామ్నాయం ఉందంటోంది… ఓ చైనా కంపెనీ. సోడియం-అయాన్ బ్యాటరీలతో… లిథియం-అయాన్ బ్యాటరీల స్థానాన్ని భర్తీ చేయవచ్చని చెబుతోంది. అంతేకాదు… లిథియం-అయాన్ బ్యాటరీల ధరలతో పోలిస్తే సోడియం-అయాన్ బ్యాటరీల ధర తక్కువగా ఉంటుందని, వీటి వల్ల ఈవీలు, స్మార్ట్ ఫోన్ల ధరల్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చని చెబుతోంది.

- Advertisement -

ప్రపంచంలోనే మొట్టమొదటి సోడియం-అయాన్ బ్యాటరీతో నడిచే ఈవీని ఆవిష్కరించింది… చైనాకు చెందిన జేఏసీ ఆటో కంపెనీ. సోడియం-అయాన్ బ్యాటరీలు చౌకైన ముడి పదార్థాలతో తయారు చేయవచ్చని, దీని వల్ల బ్యాటరీతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా తగ్గుతాయని జేఏసీ ఆటో కంపెనీ చెబుతోంది. అత్యంత అరుదైన, ఖరీదైన ‘కోబాల్ట్’ వాడకాన్ని కూడా… సోడియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగించడం ద్వారా నివారించవచ్చని పేర్కొంది. అంతేకాదు లిథియం-అయాన్ బ్యాటరీతో పోలిస్తే సోడియం-అయాన్ బ్యాటరీ అధిక భద్రతను అందిస్తుందని, అద్భుతమైన పనితీరు కలిగి ఉంటుందని చెబుతోంది. లిథియం-అయాన్ బ్యాటరీ కంటే సోడియం-అయాన్ బ్యాటరీ తక్కువ సాంద్రతను కలిగి ఉంటుందని, వేగంగా ఛార్జింగ్ చేసుకునే అవకాశంతో పాటు వేడెక్కకపోవడం దీని ప్రత్యేకత అని జేఏసీ ఆటో కంపెనీ వెల్లడించింది. సోడియం-అయాన్ బ్యాటరీల వినియోగం పెరిగితే ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, ఇది ఈవీల ధరల్ని 10 శాతం తగ్గించగలదని తెలిపింది. భవిష్యత్తులో సోడియం-అయాన్ బ్యాటరీ కచ్చితంగా ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని భావిస్తున్నామని జేఏసీ ఆటో కంపెనీ అంటోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News