Big Stories

Election Results : త్రిపురలో మళ్లీ కాషాయ జెండా రెపరెపలు.. నాగాలాండ్ బీజేపీ కూటమిదే.. హంగ్ దిశగా మేఘాలయా..

Election Results : ఈశాన్య రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తిని రేపుతున్నాయి. త్రిపురలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ దూసుకుపోతోంది. త్రిపురలో 60 స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 31 స్థానాల్లో గెలవాలి. బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించడం ఖాయమే. ఇప్పటికే దాదాపు 30పైగా స్థానాల్లో బీజేపీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం కౌంటింగ్ సరళి ప్రకారం లెఫ్ట్, కాంగ్రెస్ కూటమి దాదాపు 15 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది. కొత్తపార్టీ టీఎంపీ 10 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్‌డీపీపీ కూటమి హవా కొనసాగుతోంది. ఈ కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభించింది. దాదాపు 50 స్థానాల్లో బీజేపీ-ఎన్‌డీపీపీ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఎన్‌పీఎఫ్‌, కాంగ్రెస్‌ , ఎన్‌పీపీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. నాగాలాండ్‌లోనూ 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 31 స్థానాల మేజిక్ ఫిగర్ ను బీజేపీ-ఎన్ డీపీపీ కూటమి సాధించడం ఖాయమే.

- Advertisement -

మేఘాలయలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో ఎన్‌పీపీ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అ మేఘాలయలో 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే కనీసం 31 స్థానాల్లో గెలవాలి. అయితే ఎన్ పీపీ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచినా పూర్తి మెజార్టీ సాధించడం కష్టంగానే ఉంది. ప్రస్తుత ఎన్నికల ఫలితాల ప్రకారం ఎన్ పీపీకి టీఎంసీ గట్టి పోటీ ఇస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ చెరో 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. మేఘాలయాలో చిన్నపార్టీలు, స్వతంత్ర అభ్యర్థులే ప్రభుత్వ ఏర్పాటులో కీలకంకానున్నారు.

Gold Rates : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..?

AP: 16సార్లు కత్తితో పొడిచి.. లవర్‌ను దారుణంగా చంపిన ఉన్మాది…

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News