E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode October 1st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: టిఫిన్ బండి నడిపేందుకు శివనారాయణ రెడీ – మాలిని గురించి జ్యోత్స్నకు నిజం తెలుస్తుందా..?             

Karthika Deepam 2 Serial Today Episode October 1st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: టిఫిన్ బండి నడిపేందుకు శివనారాయణ రెడీ – మాలిని గురించి జ్యోత్స్నకు నిజం తెలుస్తుందా..?             
Advertisement

Karthika Deepam 2 serial today Episode: బయటకు వెళ్లిన శివనారాయణ ఒక టిపిన్‌ బండి దగ్గరకు వెళ్లి ఇండ్లీ తిని టేస్టీగా లేదని ఇలా అయితే కస్టమర్లు ఎలా వస్తారని ఆ టిఫిన్‌ బండి వ్యక్తికి క్లాస్‌ తీసుకుంటాడు. అప్పుడే కార్తీక్‌ వచ్చి చూసి ఓహో ఇంట్లో మనవడి దగ్గర తినడానికి మొహమాటం.. అంతేకానీ బాధతో తినడం లేదని కాదు అనుకుంటూ దగ్గరకు వెళ్తూ.. వద్దులే దగ్గరకు వెళ్తే అసలు తినడు అనుకుని దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఇడ్లీ బాగా లేదని శివనారాయణ తిడతాడు. ఇద్దరి మధ్య గొడవ జరగుతుంది. కార్తీక్‌ దగ్గరకు వెళ్తాడు. మాటా మాటా పెరిగి ఇద్దరి మధ్య గొడవ పెద్దదవుతుంది. టిఫిన్‌ బండి నెలరోజులు నడిపించి చూపిస్తానని శివనారాయణ వాడితో చాలెంజ్‌ చేసి వెళ్తాడు. తాత ఏంట ఇలా కమిట్‌ అయ్యాడు అని కార్తీక్‌ అనుకుంటాడు.

జ్యోత్స్న రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే మాలిని వెళ్తుంది. శివనారాయణ మనవరాలు ఏంటి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది అని అడిగితే.. మాలిని కొడుకు జాబ్‌ తీసేయించాడు అంటే వాడు తీసేయించలేదే నేనే తీసేయించాను.. అయినా వాడికి చెప్పాను కదా ఎవరి పేరు చెప్పొద్దని అయినా చెప్పాడా..? అయినా నీకు జాబ్‌ చేయాల్సిన కర్మ ఏంటి..? మీ బావ మిమ్మల్ని పోషిస్తాడు కదా అంటే వాళ్లెందుకు పోషిస్తారు నన్ను అంటూ జ్యోత్స్న ప్రశ్నిస్తే.. ఎందుకంటే వాళ్లు నా కంపనీలో జాబ్‌ చేస్తున్నారు. వాళ్ల జీతం ఎంతో తెలుసా..? వంద పైసలు అంటూ వెటకారంగా చెప్తుంది మాలిని.

Advertisement

జ్యోత్స్న కోపంగా మనుషులంటే నీకు ఆట వస్తువుల్లా కనిపిస్తున్నారు.. కానీ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు అంటూ హెచ్చరిస్తుంది. నాకు టైం వస్తుంది అప్పుడు నువ్వు నన్ను భయపెట్టడం కాదు.. నా ముందు నిలబడటానికి కూడా భయపడతావు అంటే.. నీ పొగరు నాకు నచ్చిందే.. కానీ ఇదంతా త్వరలోన దించేస్తాను అంటే.. ట్రై చేయ్‌ అత్తా నన్ను ఏడిపిస్తే నీకు ఆనందం వస్తుందేమో కానీ నాకు కసి పెరుగుతుంది. ఏదో ఒకరోజు నీ నెత్తి మీదే నిలబడతాను తట్టుకోలేవు.. నేను వత్తి వెలిగించిన పట్టుకున్న బాంబును అలాగే పట్టుకుంటాను అంటే చేతిలోనే పేలిపోతాను అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది.

ఇంటికి వెళ్లిన శివనారాయణ పారిజాతంతో నేను టిఫిన్‌ బండి పెట్టాలనుకుంటున్నాను.. నువ్వు నాకు సాయంగా ఉండాలి అని అడగ్గానే.. పారిజాతం ఏవండి అంటూ గట్టిగా అరుస్తుంది. అందరూ హాల్లోకి వస్తారు. ఏమైందని అడుగుతారు. శివనారాయణ కోపంగా టిఫిన్‌ బండి పెడితే ఏమైంది..? అనగానే.. దిగ్రేట్‌ శివనారాయణ టిపిన్‌ బండి పెట్టడం ఏంటి అయినా పోయి పోయి టిఫిన్‌ బండి నడపడం ఏంటండి అనగానే..

Advertisement

నా జీవితం మొదలైంది అక్కడే అంటూ చెప్తే పారిజాతం వద్దని వారిస్తుంది. కార్తీక్‌.. శివనారాయణకు సపోర్ట్‌ చేస్తుంటే.. నాకు నీ సపోర్ట్‌ అవసరం లేదు.. నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పగానే.. దశరథ, సుమిత్ర కూడా తోడుగా ఉంటామని చెప్తారు. శివనారాయణ మాత్ర తనకు ఎవరి సపోర్ట్‌ అవసరం లేదని తనకు పారిజాతం ఉంటే చాలని చెప్తాడు. అందుకు పారు ఓరి నీ ప్రేమ తగలెయ్య నన్ను మళ్లీ పనిమనిషిని చేస్తున్నావు ముసలోడా అని మనసులో తిట్టుకుంటుంది. రేపటి నుంచి మనం టిఫిన్‌ బండి రన్‌ చేస్తున్నామని కరాకండిగా చెప్తాడు.

మరోవైపు సూరజ్‌ మాలిని ఇంటికి వెళ్లగానే.. మనం ఎప్పుడూ ఒకరి జోలికి వెళ్లకూడదు మన జోలికి ఎవరైనా వస్తూ చూస్తూ కూర్చోకూడదు అని చెప్తుంటావు కదమ్మా నువ్వు ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నావా..? అని అడుగుతాడు. మాలిని ఆలోచనలో పడిపోతుంది. దక్షిణమూర్తి వెళ్లి నువ్వు నువ్వేనా..? అంటే నేనే తాత అని సూరజ్‌ చెప్పగానే.. అవతలి వాళ్లను ఎవరు ఇబ్బంది పెట్టారు అని అంటే సూరజ్‌ తన మాటలతో మాలినికి షాక్‌ ఇస్తాడు. ఇద్దరి మధ్య మాటల యుద్దం మొదలవుతుంది. సూరజ్‌.. మాలిని మీద ప్రేమ నటిస్తున్నట్టు మాట్లాడి వెళ్లిపోతాడు. ఇక సూరజ్‌ను పూర్తిగా నమ్మకూడదు అని మనసులో అనుకుంటుంది మాలిని.

సూరజ్‌ పీఏ కోసం ఇంటర్వ్యూలు జరుగుతుంటే జ్యోత్స్న అక్కడికి వెళ్తుంది. జ్యోత్స్న రెస్యూమ్‌ చూసిన సూరజ్‌ షాక్‌ అవుతాడు. వెంటనే జ్యోత్స్నను క్యాబిన్‌లోకి పిలిపిస్తాడు. నువ్వు ఇక్కడికి వస్తావని అసుల ఊహించలేదు.. అయినా నీ జాబ్‌ నేను  తీసేయలేదని తెలిసిందా..? నా మీద కోపం తగ్గిందా అని సూరజ్‌ అడిగితే.. నువ్వు మీ అమ్మ ఒక్కటే కదా అంటుంది జ్యోత్స్న. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 30th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి చుక్కలు చూపించిన దీప             

Karthika Deepam 2 Serial Today Episode September 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్, జ్యోత్స్నలను కెపేలో చూసిన దక్షిణమూర్తి        

ట్రోలర్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి..చిరు శ్రీకాంత్ సినిమా నాని పై అప్డేట్!

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

కొడుకు బతకాలంటే రూ. 26 కోట్లు కావాలి.. దాతలు ముందడుగు వేస్తే, కాటేసిన సైబర్ రాక్షసులు!

Intinti Ramayanam Today Episode: బాబు కిడ్నాప్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. అవని ప్లాన్ సూపర్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను ఇరికించిన భద్ర.. వల్లికి దిమ్మతిరిగే షాక్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..

Big Stories

Advertisement
×