E-Paper
Advertisement

రూ.46 కోట్ల చెక్కు వివాదం… సీసీబీ విచారణకు హాజరైన రాధ!

రూ.46 కోట్ల చెక్కు వివాదం… సీసీబీ విచారణకు హాజరైన రాధ!
Advertisement

Actress Radha: ప్రముఖ సినీనటి రాధిక ఇటీవల తన తోబుట్టువులు అంబిక, మల్లికార్జున పై 46 కోట్ల రూపాయల మోసం చేసి తీసుకున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి. తనకు సంబంధించిన చెక్కులను తన సోదరి అలాగే సోదరుడు మాయం చేసి తనకు తెలియకుండానే 46 కోట్ల రూపాయల మోసానికి ప్రయత్నం జరిగిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఈమె ఫిర్యాదును స్వీకరించిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB)పోలీసులు విచారణ జరిపారు. ఈ విచారణలో భాగంగానే సినీనటి రాధ(Radha) విచారణకు హాజరయ్యారు.

సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తుకు హాజరైన రాధ..

ఇలా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసు దర్యాప్తులో పాల్గొన్న రాదను సుమారుగా మూడు గంటల పాటు పోలీసులు విచారణ చేశారని తెలుస్తోంది. ఈ విచారణలో భాగంగా రాధా సంతకాలు చేసిన బ్లాక్ చెక్కులను ఎక్కడ ఉంచారు? అవి తన నుంచి తన తోబుట్టువుల వద్దకు ఎలా వెళ్లాలి? రూ.46 కోట్లకు సంబంధించిన లావాదేవీలతో తనకు ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాల గురించి రాదను విచారణ చేసినట్లు తెలుస్తోంది. ఇక రాధ మాత్రం తనుకు తెలియకుండానే 46 కోట్ల రూపాయలను ఉపయోగించి లావాదేవీలు జరిపే ప్రయత్నం చేశారని ముఖ్యంగా ఈ వ్యవహారంలో తన సోదరి అంబిక (Ambika)పై తనకు అనుమానాలు ఉన్నట్లు రాధా తెలిపారు.

రూ. 46 కోట్ల మోసం

Advertisement

ఇలా పోలీసు విచారణలో భాగంగా రాదా పలు ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలోనే రాధా చేసిన ఆరోపణలపై నిజా నిజాలు ఏంటి అనే విషయంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రాధా తన వ్యాపార లావాదేవీలకు సంబంధించి బ్లాంక్ చెక్కులపై సంతకాలు చేసి ఉంచారు. అయితే అనుకోకుండా తన వ్యాపార సంస్థలకు పేరు మార్చడంతో ఆ కొత్త పేరుపై చెక్ బుక్ తీసుకున్నారని అయితే ముందుగా సంతకాలు చేసి పెట్టిన బ్లాంక్ చెక్కుల ద్వారా ఈ 46 కోట్ల రూపాయలు మోసానికి పాల్పడినట్లు రాదా తెలిపారు.

రాధానే చెక్కులు ఇచ్చింది…

ఇలా తన డబ్బును తనకు తెలియకుండా దొంగలించారు అంటూ రాధా తన సోదరి అలాగే సోదరుడి పై ఆరోపణలు చేయడంతో ఈ వ్యాఖ్యలను గతంలో తన సోదరీ అంబిక ఖండించిన సంగతి తెలిసిందే. రాధా తన గురించి చేసిన ఆరోపణలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. గత కొద్ది రోజులుగా కుటుంబ ఆస్తులు, వ్యాపార విషయాలలో నెలకొన్న వివాదాలను పరిష్కరించడం కోసమే రాధ 5 చెక్కులు ఇచ్చారని అంబిక తెలిపారు. మధురవాయల్‌లోని 50 సెంట్ల స్థలం, ఏఆర్‌ఎస్ గార్డెన్స్‌లో వాటా, బంగారం వ్యవహారాలకు సంబంధించి మా మధ్య కొంతకాలంగా వివాదం జరుగుతుంది. ఈ అంశాల గురించి తాను జూలై నెలలోనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని, తన సోదరి తనని దొంగ అంటూ ముద్ర వేయడం సరికాదని అంబిక రాధకు కౌంటర్ ఇచ్చారు. ఇక తాజాగా ఈ కేసు వ్యవహారంలో భాగంగా రాధ సీసీబీఎదుట హాజరయ్యి పలు కీలక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తుంది.

Advertisement

Also Read: మంచిగా ఉంటూనే తొక్కేయాలని చూస్తుంటారు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు!

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 1st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: టిఫిన్ బండి నడిపేందుకు శివనారాయణ రెడీ – మాలిని గురించి జ్యోత్స్నకు నిజం తెలుస్తుందా..?             

Karthika Deepam 2 Serial Today Episode September 30th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి చుక్కలు చూపించిన దీప             

Karthika Deepam 2 Serial Today Episode September 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్, జ్యోత్స్నలను కెపేలో చూసిన దక్షిణమూర్తి        

ట్రోలర్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి..చిరు శ్రీకాంత్ సినిమా నాని పై అప్డేట్!

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

కొడుకు బతకాలంటే రూ. 26 కోట్లు కావాలి.. దాతలు ముందడుగు వేస్తే, కాటేసిన సైబర్ రాక్షసులు!

Intinti Ramayanam Today Episode: బాబు కిడ్నాప్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. అవని ప్లాన్ సూపర్..

Big Stories

Advertisement
×