Ninnu kori serial today Episode: సామ్రాట్, చంద్రను తీసుకుని బయట గార్డెన్‌లోకి తీసుకెళ్తాడు. ఏంటండి ఉన్నట్టుండి ఎందుకు ఇలా బయటకు తీసుకొచ్చారు అని చంద్ర అడిగితే.. ఇలా మనిద్దరం కలిసి ఆరు బయట నిలబడటం ఇదే మొదటిసారి కదా అంటాడు సామ్రాట్.. అవును అంటుంది చంద్ర. కానీ నాకెందుకు మీతో ఇంతకు ముందు ఆరు బయట ఇలా మాట్లాడుకున్నావేమో అనిపిస్తుంది అంటాడు. అయితే కళ్లు మూసుకుని ఊహించుకోండి అంటూ చంద్ర చెప్తుంది. తన బావకు తనతో కలిసి ఆకాశాన్ని చూడటం అంటే చాలా ఇష్టమని తనను చందమామతో పోల్చేవాడని.. ఆ చందమామను అంటిపెట్టుకుని ఉన్న చుక్కలాగా తనను ఎప్పుడూ అంటిపెట్టుకని ఉండాలని కోరుకునేవాడు అంటూ చంద్ర చెప్తుంటే.. సామ్రాట్ వింటుంటాడు.
కేవశ పేపర్ చదువుతుంటే.. సామ్రాట్ వెళ్తాడు. ఏంటి నాన్న ఇవాళ న్యూస్ అని అడిగితే.. ఇంకేం ఉంటాయి ఆస్థి కోసం ఒకరినొకరు చంపుకున్న అయినవాళ్లు ఇంతేగా ఉంటాయి వార్తలు అంటూ చెప్తుంటే.. చంద్ర కాఫీ తీసుకొస్తుంది. సామ్రాట్ కాఫీ కుడిచేత్తో తీసుకుంటే అదేంట్రా అలా తీసుకున్నావు నువ్వు ఎడమ చేత్తో కదా తీసుకోవాలి అంటూ కేశవ చెబితే ఏమో నాన్న అలవాటు ఉన్నట్టు కుడిచేత్తోనే తీసుకున్నాను అంటూ కాఫీ తాగి చాలా బాగుందని తన టేస్ట్ ఎలా చేశావని చంద్రను అడుగుతాడు. చంద్ర క్యాజువల్‌గానే చేశానని చెప్తుంది. అంతా గమనిస్తున్న కేశవ మాత్రం నీ గతంతో పాటు నీ అలవాట్లు కూడా మారిపోయాయి అంటూ చెప్తాడు. సామ్రాట్ మాత్రం తన అలవాట్లు ఏవో కూడా తనకు గుర్తు లేదని చెప్పి వెళ్లిపోతాడు. ఎందుకండి అంత కంగారు పడుతున్నారు అంటూ చంద్ర అడిగితే కేశవ బాధపడతాడు. సామ్రాట్ ఇంకెప్పుడు గతం గుర్తుకు వస్తుందోనని ఎమోషనల్ అవుతాడు.
గార్డెన్‌లో ఫోన్ మాట్లాడుతున్న శ్రీజను చూసిన మదన్ ఊహల్లో తేలిపోతుంటాడు. శ్రీజను హగ్ చేసుకున్నట్టు ఊహించుకుంటుంటాడు. శ్రీజ చూసి పిలిచినా పలకడు దీంతో శ్రీజ లాగిపెట్టి కొడుతుంది. మదన్ ఊహల్లోంచి బయటకు వస్తాడు. తన బావను పడేయడానికి ఇంకో ట్రిక్ చెప్పమని అడుగుతుంది శ్రీజ. మదన్ మాత్రం ఈవిడ మనసులోంచి ఆ బావను ఎలా తీసేయాలో తెలియడం లేదు అని మనసులో అనుకుంటాడు. బయటకు మాత్రం మదన్, శ్రీజకు మరో ట్రిక్ చెప్తాడు. సరే మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ శ్రీజ ఇంట్లోకి వెళ్లిపోతుంది. మదన్ చెప్పిన ట్రిక్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి అనుకుంటూ సామ్రాట్‌కు ఎదురుగా వెళ్తూ.. మౌనంగా వెళ్లిపోతుంటే.. సామ్రాట్ వెంటనే శ్రీజను పిలుస్తాడు. శ్రీజతో మాట్లాడుతుంటాడు.
దీంతో ప్లాన్ వర్కవుట్ అవుతుంది. బావ లైన్‌లోకి వస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది. అప్పుడే సామ్రాట్ నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి ప్రేమించాను అంటున్నావు కదా అయితే మన మధ్య ఉన్న ఏదైనా స్వీట్ మెమెరీ గుర్తు చేయ్ అని అడుగుతాడు. శ్రీజ మౌనంగా అలాంటివి మన మధ్య ఉంటే కదా గుర్తు చేయడానికి అని మనసులో అనుకుంటుంది. అప్పుడే సామ్రాట్ నువ్వు లవ్ చేశావని అర్థం అవుతుంది. నేను కూడా నిన్ను లవ్ చేశానా..? అంటూ ప్రేమ గురించి శ్రీజ ప్రేమలో నిజాయితీ గురించి అడుగుతాడు అప్పుడు శ్రీజ జరిగిన విషయాలు మొత్తం చెప్తుంది. అప్పుడే సామ్రాట్ తాను శ్రీజ ప్రేమకు నో చెబితే ఏం చేస్తావని అడుగుతాడు. అందుకు శ్రీజ మదన్ చెప్పిన ప్లాన్ ప్రకారం తనను పెళ్లి చేసుకునే అదృష్టం సామ్రాట్‌కు లేదనుకుంటా అంటూ చెప్పి వెళ్లిపోతుంది శ్రీజ. దీంతో సామ్రాట్ తాను శ్రీజను ప్రేమించలేదన్న క్లారిటీకి వస్తాడు.
దాక్షాయణి కిచెన్‌లో వంట చేస్తుంటే.. చంద్ర హెల్ప్ చేస్తానని వెళ్తుంది. వెజిటేబుల్ కట్ చేస్తుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన నీలగిరి, గిరిజ చూసి చూశావా అది కబ్జా చేయడానికి ఇక అల్లుడి బెడ్ రూం ఒక్కటే మిగిలిపోయింది అనుకుంటూ కిచెన్‌లోకి వెళ్లి వెజ్ కర్రీస్ ఏం చేస్తారు. మేము రొయ్యలు తీసుకొచ్చాము అల్లుడికి రొయ్యల వేపుడు చేయమని అడుగుతారు. విరాట్‌కు రొయ్యల పడవని.. అలర్జీ వస్తుందని ఎలాగైనా రొయ్యలు చేయకూడదని చంద్ర మనసులో అనుకుని వెంటనే సామ్రాట్‌కు ఉన్న శత్రువులు ఎవరు అంటూ దాక్షాయణిని అడుగుతుంది. దాక్షాయణి షాక్ అవుతుంది. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.