E-Paper
Advertisement

నా సినిమాలను కావాలనే టార్గెట్ చేస్తున్నారు.. సందీప్ కిషన్ సంచలన పోస్ట్!

నా సినిమాలను కావాలనే టార్గెట్ చేస్తున్నారు.. సందీప్ కిషన్ సంచలన పోస్ట్!
Advertisement

Sandeep Kishan: సందీప్ కిషన్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ప్రస్థానం, టైగర్, డి ఫర్ దోపిడీ వంటి సినిమాల ద్వారా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన త్వరలోనే సిగ్మా(Sigma) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు .ఈ సినిమా అక్టోబర్ రెండో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి కొన్ని గంటలలో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో సందీప్ కిషన్ (Sandeep Kishan)సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

డబ్బులు ఇచ్చి మరి టార్గెట్ చేయిస్తున్నారు..

ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాని తొక్కేసే ప్రయత్నాలు చాలా జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమా బాగున్నప్పటికీ బాలేదంటూ నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారని కొంతమంది ఉద్దేశపూర్వకంగానే సినిమాలను తొక్కేస్తున్నారు అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా సందీప్ కిషన్ సైతం ఇదే విషయం పట్ల సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ చేశారు. “గత కొన్ని రోజులుగా నన్ను, నా సినిమాను టార్గెట్ చేస్తూ చాలా యాంటీ ట్వీట్లు వస్తున్నాయి.దీని వెనుక ఎవరున్నారు? ఇందుకోసం ఎవరు డబ్బులు చెల్లిస్తున్నారు? అనే విషయాలు నాకు బాగా తెలుసు…

నాకంటే మీరే ఎక్కువగా కోల్పోతారు..

Advertisement

ఒక్క విషయం గుర్తు చేస్తున్నాను.. నాకంటే మీరే ఎక్కువగా కోల్పోతారు …నేరుగా బయటపెడితే అందరూ దొరికిపోతారు మరి.. చూసుకోండి” అంటూ సందీప్ కిషన్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి ఈయన సినిమాలను టార్గెట్ చేస్తూ డబ్బులు ఇచ్చి మరి తొక్కేస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు? ఎందుకు సందీప్ సినిమాలను టార్గెట్ చేశారు? అంటూ ఈ పోస్ట్ చూసిన అభిమానులు పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. ఆ వ్యక్తులు ఎవరో తెలియాలి అంటే సందీప్ కిషన్ స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే.

Advertisement

ఇక సందీప్ కిషన్ నటిస్తున్న సిగ్మా సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్(Vijay) కుమారుడు జోసెఫ్ సంజయ్(Sanjay) దర్శకుడిగా సిగ్మా సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ కి జోడిగా ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) నటించారు. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. రేపు విడుదల కాబోతున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుంది, దర్శకుడిగా సంజయ్ తన మొదటి సినిమాతో సక్సెస్ అయ్యేనా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Also Read: లవ్ స్టోరీ బయటపెట్టిన హైపర్ ఆది..ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనంటూ!

Related News

రూ.46 కోట్ల చెక్కు వివాదం… సీసీబీ విచారణకు హాజరైన రాధ!

Karthika Deepam 2 Serial Today Episode October 1st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: టిఫిన్ బండి నడిపేందుకు శివనారాయణ రెడీ – మాలిని గురించి జ్యోత్స్నకు నిజం తెలుస్తుందా..?             

Karthika Deepam 2 Serial Today Episode September 30th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి చుక్కలు చూపించిన దీప             

Karthika Deepam 2 Serial Today Episode September 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్, జ్యోత్స్నలను కెపేలో చూసిన దక్షిణమూర్తి        

ట్రోలర్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి..చిరు శ్రీకాంత్ సినిమా నాని పై అప్డేట్!

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

కొడుకు బతకాలంటే రూ. 26 కోట్లు కావాలి.. దాతలు ముందడుగు వేస్తే, కాటేసిన సైబర్ రాక్షసులు!

Big Stories

Advertisement
×