E-Paper
Advertisement

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి
Advertisement

Palamu River: ఝార్ఖండ్ జిల్లా పలాములోని కోయల్ నది వద్ద చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర శోకాన్ని నింపింది. ఆదివాసీ వేడుకలో భాగమైన సాంప్రదాయ పూజ ముగిసిన తర్వాత, నదిలో చెట్టు కొమ్మను నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఐదుగురు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నపిల్లలు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది.

ప్రమాదం ఎలా జరిగిందంటే..

Advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం పండుగ ఉత్సాహంతో నిర్వహించిన పూజా కార్యక్రమం అనంతరం గ్రామానికి చెందిన కొందరు గ్రామస్థులు నిమజ్జనం కోసం కోయల్ నది ఒడ్డుకు చేరుకున్నారు. నీటి లోతును సరిగ్గా అంచనా వేయకపోవడంతో, లోపలికి వెళ్లిన ఐదుగురు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ఒక్కసారిగా గల్లంతయ్యారు.

రంగంలోకి దిగిన జాలర్లు..

Advertisement

ఈ ప్రమాదాన్ని గమనించిన ఒడ్డున ఉన్న స్థానికులు వెంటనే కేకలు వేశారు. రంగంలోకి దిగిన స్థానిక జాలర్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నదిలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, దురదృష్టవశాత్తు కొద్దిసేపటికే ఐదుగురి మృతదేహాలు మాత్రమే వారికి లభ్యమయ్యాయి. మృతదేహాలను ఒడ్డుకు చేర్చిన అనంతరం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

తరువాత మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పండుగ వాతావరణంతో కళకళలాడాల్సిన గ్రామంలో ఈ అనూహ్య ఘటన తీవ్ర శోకసంద్రంలోకి నెట్టివేసింది. తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Also Read: ధర్మవరంలో కేతిరెడ్డి మాస్టర్ స్ట్రోక్.. ఆ మాజీ కౌన్సిలర్లకు మైండ్ బ్లాంక్!

Tags

Related News

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఒడిశాలో ఘోరం.. రోడ్డుపై అడ్డగించి జంటపై దాడి.. కలకలం రేపుతున్న వీడియో!

అయోధ్య రామమందిరం కేసులో సంచలనం.. 105 సార్లు విరాళాల చోరీ.. బయటపెట్టిన సిట్!

Big Stories

Advertisement
×