E-Paper
Advertisement

భద్రాద్రి జిల్లాలో దారుణం.. నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి!

భద్రాద్రి జిల్లాలో దారుణం.. నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి!
Advertisement

Nursing Student: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ఓ నర్సింగ్ విద్యార్థిని తన నివాసంలోనే అనుమానాస్పద రీతిలో శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అసలేం జరిగింది?

Advertisement

వెంగన్నపాలేనికి చెందిన ఇంద్రవెల్లి హరిణి (18) తనికెళ్ల సమీపంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో నర్సింగ్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కళాశాల హాస్టల్‌లోనే ఉంటూ చదువుకుంటున్న ఆమె, ఇటీవల కొత్తగూడెంలోని పిన్ని ఇంటికి వెళ్లి, మూడు రోజుల క్రితమే సొంతూరు వెంగన్నపాలెం వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంట్లో తల్లీకూతుళ్లు ఇద్దరే ఉన్నారు. ఆ తర్వాత తల్లి రాజేశ్వరి సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి చూడగా హరిణి ఇంట్లో కనిపించలేదు. చుట్టుపక్కల వెతకగా, ఇంటి వెనుక మరుగుదొడ్డి పక్కన ఉన్న సందులో ఆమె విగతజీవిగా పడి ఉండటం కనిపించింది.

హత్యేనని స్థానికుల అనుమానం

Advertisement

హరిణి నుదిటిపై, ముక్కు కింద తీవ్ర గాయాలు ఉండటంతో పాటు మెడపై నులిమిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. ఎవరో కావాలనే ఆమెను హత్య చేసి అక్కడ పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పోలీసుల విచారణ వేగవంతం

సమాచారం అందుకున్న జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, ఎస్సై జీనత్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, పోస్టుమార్టం నివేదిక వచ్చాకే మృతికి గల పూర్తి కారణాలు తెలుస్తాయని వెల్లడించారు. మూడేళ్ల క్రితమే తండ్రిని కోల్పోయిన హరిణి ఇలా దారుణంగా ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Also Read: పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

Tags

Related News

టెక్కీకి ముద్దుపెట్టిన సెక్యూరిటీ గార్డు, గచ్చిబౌలిలో ఘటన, నిందితుడు అరెస్ట్

నల్గొండ జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో భార్యాభర్తల మృతి!

జూరాలకు 5 టీఎంసీల నీళ్లు వస్తాయా? డీకే శివకుమార్‌తో రేవంత్ టీమ్ బిగ్ డీల్!

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, ఏపీ-ఉత్తర తెలంగాణల్లో ఫ్లాష్‌ఫ్లడ్‌, పాఠశాలలకు సెలవులు, రైళ్లు రద్దు

రేపు తెలంగాణకు భారీ వానగండం.. ఈ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..?

ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. మంత్రి వివేక్ కీలక ప్రకటన!

ఇక స్మార్ట్ సిటీగా నల్గొండ జిల్లా.. మంత్రి వెంకట్ రెడ్డి కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×