E-Paper
Advertisement

ఒడిశాలో ఘోరం.. రోడ్డుపై అడ్డగించి జంటపై దాడి.. కలకలం రేపుతున్న వీడియో!

ఒడిశాలో ఘోరం.. రోడ్డుపై అడ్డగించి జంటపై దాడి.. కలకలం రేపుతున్న వీడియో!
Advertisement

Odisha Couple Attack: బిహార్‌లో ఓ మైనర్ బాలుడు, బాలికపై జరిగిన దాడి ఘటన మరవకముందే.. ఒడిశాలోని ధెంకనాల్ జిల్లా (Dhenkanal District)లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కొంతమంది ఆకతాయిలు ఓ యువ జంటను మార్గమధ్యంలో అడ్డుకుని దాడి చేయడమే కాకుండా వేధింపులకు గురిచేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

బైక్‌పై వెళ్తుండగా అడ్డగించి..

ధెంకనాల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కపిలాష్ వైపు వెళ్తున్న రోడ్డుపై ఈ ఘటన జరిగింది. సదరు యువ జంట ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో కొందరు వ్యక్తులు వారిని అకారణంగా నిలిపివేశారు. ఆ తర్వాత వారంతా ఒకేసారి జంటను చుట్టుముట్టి దౌర్జన్యానికి దిగారు.

Advertisement

యువతి ఎంత వేడుకున్నా వినకుండా..

నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో.. గుంపుగా ఉన్న ఆకతాయిలు యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో అక్కడే ఉన్న మరికొందరు యువతి పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ యువతి కన్నీళ్లు పెట్టుకుంటూ ‘మమ్మల్ని వదిలేయండి’ అని పదే పదే దండం పెట్టి వేడుకున్నప్పటికీ ఆ ఆకతాయిలు కొంచెం కూడా కనికరం లేకుండా వేధింపులను కొనసాగించారు.

రంగంలోకి పోలీసులు..

Advertisement

అయితే ఆ గుంపు జంటను ఎందుకు అడ్డుకుంది? వారి మధ్య అంతకుముందేమైనా గొడవలు జరిగాయా? లేక కావాలనే వేధించారా? అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటనపై గోండియా బ్లాక్ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ దలై మాట్లాడుతూ.. వీడియో ఆధారంగా దాడికి పాల్పడిన కొందరిని ఇప్పటికే గుర్తించామని చెప్పారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Also Read: ఈఎంఐ తక్కువే అని లోన్ తీసుకుంటున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే.. ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఉందా?

బిహార్‌లోనూ ఇలాంటి ఘటనే..

బిహార్‌లోని జముయ్ జిల్లాలోనూ సెప్టెంబర్ 19 సాయంత్రం ఇద్దరు మైనర్లపై ఇలాగే దాడి జరిగింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవ్వడంతో.. జముయ్ ఎస్పీ బిశ్వజిత్ దయాళ్ నేతృత్వంలో ‘సిట్’ (SIT) ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేయగా మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read: కీబోర్డ్ F, J కీలపై ఉండే చిన్న గీతల కథేంటి? టైపింగ్ వేగానికి, ఆరోగ్యానికి ఉన్న లింకేంటి?

Tags

Related News

అయోధ్య రామమందిరం కేసులో సంచలనం.. 105 సార్లు విరాళాల చోరీ.. బయటపెట్టిన సిట్!

యువతి యువకుడిపై దాడి.. అసభ్యకరంగా మాటలు, బీహార్‌లో ఘటన, వీడియో వైరల్

చచ్చిపోయిన లండన్‌కు సీఎం విజయ్ ఎందుకు.. మధురై వెళ్లాలని అన్నామలై ఘాటు వ్యాఖ్యలు

భూ కేసులో హేమంత్ సోరెన్‌కు షాక్.. నేడు PMLA కోర్టులో కీలక విచారణ!

రైతులను నెలకు రూ.3 వేలు పెన్షన్.. ఆ స్కీమ్ గురించి తెలుసా, వెంటనే అప్లై చేయండి?

రోడ్డుపై BMW బీభత్సం, స్పాట్‌లో ముగ్గురు మృతి, ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం

Big Stories

Advertisement
×