Big Stories

Karthika Pournami Special Pooja : కార్తీక పౌర్ణమి రోజు ఈ ఒక్క పని చేయండి చాలు ..

Karthika Pournami Special Pooja : పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం పేరుతో వస్తుంది. చంద్రుడు కృత్రికా నక్షత్రం దగ్గర పౌర్ణిమ రోజున ఉన్న మాసానికి కార్తీకమాసం అని పేరు.అంటే ఆ నక్షత్రం యొక్క ప్రభావం అత్యధికంగా ఉంటుంది. పౌర్ణమికి అటు పదిహేను రోజులు నక్షత్ర ప్రభావం ఉంటుంది.
ఇటు కూడా ప్రభావం ఉంటుంది. అదే మధ్యస్థానంలో అది ఏ స్థాయిలో ఎంత ఉంటుందన్న అన్న ప్రశ్న వస్తుంది. కేంద్రం స్థానంలో పౌర్ణమి ప్రభావం సమస్య జీవరాశిపై అమితంగా ఉంటుంది. అందుకే కార్తీక మాసం మొత్తానికి ముఖ్యమైన రోజు కార్తీక పౌర్ణమి.

- Advertisement -

పౌర్ణమి వెలుగులు :

- Advertisement -

పౌర్ణమి అంటే పుచ్చ పువ్వలుగా కనిపించే వెండి వెన్నెల మనకు గుర్తుకు వస్తుంది. మిగిలిన మాసాలు కన్నా శరదృతువులోను అందులోను కార్తీక పౌర్ణమి రోజు వెన్నెల చాలా దట్టంగా ,సాంద్రంగా , అత్యధికంగా ఉంటుంది. కార్తీకమాసంలో చీకట్లు ఎంత దట్టంగా ఉంటాయో.. వెన్నెల కూడా అలాగే ఉంటుంది. కార్తీక పౌర్ణమి వెలుగులు అద్భుతంగా ఉంటాయి.

పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కార్తీకపౌర్ణమి. అందుకే శివుడికి అభిషేకాలు విష్ణువుకి సహస్రనామార్చనలు చేస్తారు..ఎందుకంటే ఈ సమయంలో పూజలు చేసిన ఫలితం మిగిలిన సమయాల్లో చేసిన దానికంటే ఎన్నో రెట్లు ఉంటుంది. శివుడు త్రిపురాసురులను సంహరించింది కూడా ఈ పౌర్ణమి రోజు కావడంతో ప్రజలంతా పండుగ చేసుకున్నారు. అందుకే దీనికి త్రిపుర పౌర్ణమి అని పేరు.

జ్వాలా తోరణాలు కనిపించే రోజు :

కార్తీక పౌర్ణమి రోజు శివ,పార్వతులకి కళ్యాణం చేస్తుంటారు. అంతేకాదు కళ్యాణం తర్వాత గడ్డివెంటలతో జ్వాలా తోరణంలా కట్టి వెలిగించి ఆ మంటల కింద నుంచి శివపార్వతులను ఊరేగించే సంప్రదాయ ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కార్తీకపౌర్ణమి రోజునే నిర్వహిస్తారు.అరుణాచలంలోని జ్యోతి స్వరూపుడై వెలిసిన శివుడి అగ్నిలింగాన్ని దర్శించుకోవడానికి వేలాదిమంది అక్కడికి తరలివెళ్తారు.

మహిళలు ఉపవాసం చేస్తే… :

ఈ రోజున మహిళల ప్రత్యేకంగా ఉపవాసం గురించి శాస్త్రాలు చెబుతున్నాయి . పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపారాధన చేసి, చలిమిడిని చంద్రుడికి నివేదించి, ఫలహారంగా స్వీకరించాలని చెబుతాయి . ఇలాచేయడం వల్ల కడుపు చలవ అని పెద్దలంటారు. ఆరోగ్యపరంగా చూస్తే ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News