Big Stories

Team Indias Thrilling Victory : పాక్ పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ..

Team Indias Thrilling Victory : భారత్-పాక్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ ఎలా ఉంటుందో.. బాల్ బాల్ కు గూస్ బంప్స్ అంటే ఏంటో… దాయాది మీద గెలుపు మజా ఎలా ఉంటుందో.. మరోసారి క్రికెట్ ఫ్యాన్స్ చవిచూశారు. T20 వరల్డ్ కప్ లో చివరి బంతి దాకా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో… పాకిస్థాన్ పై 4 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది… టీమిండియా. మ్యాచ్ ఎలా సాగిందో చెప్పాలంటే… మాటలు సరిపోవు. కచ్చితంగా చూసి తీరాల్సిందంతే.

- Advertisement -

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్… రెండో ఓవర్లోనే కెప్టెన్ బాబర్ ఆజమ్ వికెట్ కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్ లో ఆజమ్ డకౌటయ్యాడు. నాలుగో ఓవర్ చివరి బంతికి 4 పరుగులు చేసిన రిజ్వాన్ కూడా అర్షదీప్ కే వికెట్ ఇచ్చాడు. 15 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన దశలో… షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్ ఆచితూచి ఆడారు. మూడో వికెట్ కు 76 పరుగులు జోడించారు. 51 రన్స్ చేసిన ఇఫ్తికార్ మూడో వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత పాకిస్థాన్ 29 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో షా అఫ్రిదీ, షాన్ మసూద్ ధాటిగా ఆడటంతో… 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగలిగింది.. పాకిస్థాన్. అఫ్రీదీ 8 బంతుల్లోనే 16 రన్స్ చేయగా… మసూద్ 52 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు.

- Advertisement -

160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్… తడబడుతూ ఇన్నింగ్స్ ప్రారంభించింది. రాహుల్, రోహిత్ చెరో 4 పరుగులు చేసి ఔట్ కాగా… సూర్యకుమార్ యాదవ్ 10 బంతుల్లో 15 రన్స్ చేసి ఔటయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చిన అక్షర్ పటేల్ కూడా 2 పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడం… అప్పటికే ఆరు ఓవర్లు పూర్తి కావడంతో… విజయం అసాధ్యమేమో అన్న అనుమానాలు కలిగాయి. కానీ… కోహ్లీ, పాండ్యా మరో వికెట్ పడకుండా ఆచితూడి ఆడుతూ పరుగులు రాబట్టారు. ఇద్దరి భాగస్వామ్యం చివరి ఓవర్ దాకా సాగింది. నాలుగో వికెట్ కు కోహ్లీ, పాండ్యా ఏకంగా 113 పరుగులు జోడించారు. చివరి 3 ఓవర్లలో విజయానికి 48 పరుగులు అవసరం కాగా… 18వ ఓవర్లో 17 రన్స్ వచ్చాయి. 19వ ఓవర్లో చివరి రెండు బంతుల్ని కోహ్లీ సిక్సర్లు కొట్టడంతో ఆ ఓవర్లోనూ 15 రన్స్ వచ్చాయి. ఇక చివరి ఓవర్లో విజయానికి 16 రన్స్ అవసరమయ్యాయి. తొలి బంతికే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో పాండ్యా ఔటయ్యాడు. రెండో బంతికి కోహ్లీ రెండు పరుగులు తీశాడు. మూడో బంతికి ఫుల్ టాస్ వేయడంతో… దాన్ని కోహ్లీ సిక్సర్ గా మార్చాడు. అయితే బంతి ఎక్కువ ఎత్తులో రావడంతో అంపైర్ దాన్ని నో బాల్ గా ప్రకటించాడు. దాంతో మరో పరుగు అదనంగా వచ్చింది. ఫ్రీ హిట్ బాల్ ను పాక్ బౌలర్ వైడ్ వేయడంతో… మరో పరుగు వచ్చింది. దాంతో చివరి 3 బంతుల్లో విజయానికి ఐదు పరుగులు కావాల్సి వచ్చాయి. ఫ్రీ హిట్ బాల్ కు బౌల్డ్ అయిన కోహ్లీ… బంతి బౌండరీ లైన్ వైపు వెళ్లడంతో 3 పరుగులు తీశాడు. దాంతో చివరి రెండు బంతులకు రెండు పరుగులు కావాల్సి వచ్చాయి. చివరి ఓవర్ ఐదో బంతి ఆడిన దినేష్ కార్తీక్… స్టంప్ ఔట్ అయ్యాడు. దాంతో… చివరి బంతికి రెండు రన్స్ కావాల్సి వచ్చాయి. ఎంతో ఒత్తిడిలో బ్యాటింగ్ కు వచ్చిన స్పిన్నర్ అశ్విన్… పాక్ స్పిన్నర్ బంతి వేయగానే… అది వైడ్ గా వెళ్తుందని భావించి వదిలేశాడు. ఆ బంతి కాస్తా వైడ్ వెళ్లడంతో మరో పరుగు వచ్చింది. దాంతో మ్యాచ్ టై అయింది. చివరి బంతికి పరుగు రాకుండా చూడాలని మొత్తం ఫీల్డర్లు అందరినీ సర్కిల్ లోపలే మోహరించాడు.. పాక్ కెప్టెన్ బాబార్ ఆజమ్. కానీ అశ్విన్… చివరి బంతిని పాక్ ఫీల్డర్లకు అందకుండా బౌండరీలైన్ వైపు గాల్లోకి లేపడంతో… భారత్ క్రికెట్ జట్టు, కోట్లాది అభిమానులు గెలుపు సంబరాల్లో మునిగితేలారు. దాదాపు అసాధ్యం అనుకున్న మ్యాచ్ లో విజయం సాధించడంతో… ఆటగాళ్లతో పాటు అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇవాళ్టి మ్యాచ్ లో కోహ్లీ, పాండ్యానే హీరోలుగా నిలిచారు. పాండ్యా 37 బంతుల్లో 40 రన్స్ చేయగా… కోహ్లీ 53 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. అతనికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News