Ninnu kori serial today Episode: ఇంట్లోంచి వెళ్లిపోతున్నట్టు నాటకం ఆడతారు మందర, మాయ. వాళ్లు బ్యాగ్ సర్దుకుని వెళ్లిపోతుంటే చంద్ర ఆగమని ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. ఇందాకే ఇంట్లోంచి కదిలేది లేదని అన్నారు అప్పుడే ఎక్కడికి వెళ్తున్నారు అంటూ కామాక్షి ప్రశ్నిస్తుంది. ఊర్లో తెలిసిన వాళ్లు చనిపోయారని అందుకే ఊరెళ్తున్నామని మాయ చెప్పగానే.. క్రాంతి మీకు ఎవ్వరూ లేరని అన్నారు కదా అంటూ ప్రశ్నించగానే..
చాలా రోజులు ఊర్లో కలిసి ఉన్నాం.. తెలిసిన వ్యక్తి చనిపోయాడని తెలియగానే ఇక్కడ ఉండబుద్ది కావడం లేదు అంటూ మందర చెప్తూ.. పద మాయ ఇప్పటికే చాలా లేటు అయింది అనగానే.. చంద్ర నేను మీతో వస్తాను అంటూ వెళ్లబోతుంటే.. షాలిని వచ్చి అడ్డపడుతుంది చంద్ర నీకెందుకు శ్రమ నేను ఎలాగూ బిజినెస్ పని మీద గచ్చిబౌలి వెళ్తున్నాను నేను వెళ్లి డ్రాప్ చేస్తాను అంటుంది. చంద్ర సరే కానీ మాయను అక్కడే వదిలేసిరాకు అంటుంది.
విరాట్ కోపంగా ఇంట్లోకి వచ్చి మాయ బయటకు రా అంటూ పిలుస్తుంటే.. అందరూ వస్తారు. బయటకు రావడానికి ఇంట్లో ఉంటే కదా ఎప్పుడో బయటకు వెళ్లింది అని శృతి చెప్తుంది. జగదీశ్వరి వచ్చి రెండో భార్యను వదిలి ఉండలేడేమో అంటూ వెటకారంగా మాట్లాడితే విరాట్ కోపంగా మాయ నా భార్య కాదు నేను మాయను పెళ్లి చేసుకోలేదు.. మాయ తన మెడలో తాళి తనే వేసుకుంది అని చెప్తాడు. విరాట్ నిజం చెప్పగానే అందరూ షాక్ అవుతారు. అప్పుడే వచ్చిన షాలిని బయటి నుంచి వింటూ అనుకున్నట్టే నిజం చెప్పేశాడు అనుకుంటుంది. మదన్ కన్ఫీజ్‌గా అసలేం జరుగుతుంది ఈ ఇంట్లో అని మనసులో అనుకుంటాడు. రఘురాం కోపంగా పెళ్లి కాకుండానే తాళి వేసుకోవడం ఏంట్రా అంటే అసలు నిజం చెప్తాడు విరాట్. అమ్మ కోసం మాయతో పెళ్లి అయినట్టు నటించానని అమ్మకు బాగయ్యాక తాళి కడతానని చెప్పాను అంటాడు.
విరాట్ మాటలకు జగదీశ్వరి ఎమోషనల్ అవుతుంది. ఏడుస్తూ.. విరాట్‌ను హగ్ చేసుకుని చంద్ర చూశావా నీ బావ తప్పు చేయలేదు.. అంటూ చెప్తుంటే.. నాకు తెలుసు అత్తయ్య అంటుంది. క్రాంతి నీకు కూడా తెలుసా..? వదిన అని అడిగితే.. కామాక్షి నీకు కూడా తెలుసా.? అంటే నీకు తెలుసా…? అని అడుగుతుంది. అందరూ ఒకరికొకరు తెలుసని చెప్పుకోగానే.. మదన్ షాక్ అవుతాడు. అంటే అందరూ కలిసి నాతో ఆటాడారా..? అంటాడు. శృతి కూడా అంటే ఇంట్లో మేమేనా పిచ్చోళ్లం అని అడుగుతుంది. మదన్ ఇంట్లోంచి వెల్లిపోవాలని ట్రై చేస్తుంటాడు. అంతా గమనిస్తున్న షాలిని అందరినీ డైవర్ట్ చేయాలని తన తలను గోడకేసి కొట్టుకుంటుంది రక్తం వచ్చేలా కొట్టుకుని ఇంట్లోకి వెళ్తుంది. ఆ మందర, మాయ తనను రాయితో కొట్టి పారిపోయారు అంటూ చెప్తుంది. విరాట్ కోపంగా మాయ కోసం వెళ్తుంటే.. జగదీశ్వరి ఆపుతుంది. విరాట్ మాత్రం జగదీశ్వరికి నచ్చజెప్పి నేను తిరిగి వచ్చి మీ అందరికీ శుభవార్త చెప్తాను అంటూ వెళ్లిపోతాడు. వెనకాలే చంద్ర వెళ్తుంది. చంద్ర వెనకాలే మదన్ వెళ్తాడు.
ఇంట్లో వాళ్లను తన సెంటిమెంట్‌తో నమ్మిస్తుంది షాలిని. తర్వాత పక్కకు వెళ్లి రౌడీలకు ఫోన్ చేసి విరాట్ వచ్చాడని ఈరోజుతో విరాట్ చాప్టర్ క్లోజ్ అయిపోవాలని చెప్తుంది. రౌడీలు వాడి చావు వార్త మీకు వస్తుంది మేడం అని చెప్తాడు. కాల్ కట్ చేసి గుడ్ బై బావ గారు అంటూ హ్యాపీగా ఫీలవుతుంది. ఇన్ని రోజులకు నా పగ పూర్తిగా తీర్చుకునే సమయం వచ్చింది అనుకుంటుంది.
మరోవైపు విరాట్‌ను లారీతో గుద్దేయడానికి వెళ్తుంటాడు. విరాట్ కారులో మాయను వెతుక్కుంటూ వెళ్తుంటాడు. మాయ, మందర ఆటోలో వెళ్తుంటారు. విరాట్ మనం ఎక్కడున్నా పట్టుకుంటాడని మనం ఈ స్టేట్ వదిలిపోతేనే సేఫ్ అని చెప్తుంది మాయ. ఇంతలో ఈరోజు నిన్నుకోరి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.