BigTV English

Lamborghini Huracan Sterrato Launched In India : కొత్త కార్ లాంచ్ చేసిన లంబోర్గిని.. ధర ఎంతో తెలుసా?

Lamborghini Huracan Sterrato Launched In India : కొత్త కార్ లాంచ్ చేసిన లంబోర్గిని.. ధర ఎంతో తెలుసా?

Lamborghini Huracan Sterrato Launched In India : ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ లంబోర్గిని… భారతీయ మార్కెట్లోకి మరో కొత్త కార్ లాంచ్ చేసింది. హురాకాన్ స్టెరాటోగా పిలిచే ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర అక్షరాలా 4 కోట్ల 61 లక్షల రూపాయలు. దీనికి రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ కలిపితే… ఆన్ రోడ్ ధర 5.5 కోట్ల రూపాయల దాకా ఉండే అవకాశం ఉంది. లిమిటెడ్ ఎడిషన్ కింద కేవలం 1499 హురాకాన్ స్టెరాటో కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది… లంబోర్గిని. ఈ కార్ కోసం అప్పుడే బుకింగ్స్ కూడా ప్రారంభించింది. వచ్చే ఏడాది నుంచి కస్టమర్లకు కార్లను డెలివరీ చేయబోతున్నారు. ప్రస్తుతం స్టెరాటో కోసం రెండంకెల బుకింగ్స్ వచ్చాయని… వచ్చే ఏడాదిన్నరకు సరిపడా ఆర్డర్లు ఉన్నాయని లంబోర్గిని తెలిపింది.


లంబోర్గిని హురాకాన్ స్టెరాటో స్పెసిఫికేషన్స్ చూస్తే… ఆల్ వీల్ డ్రైవ్ కార్ అయిన దీంట్లో… 5.2 లీటర్ ఇంజిన్ అమర్చారు. ఇది 602 bhpతో పాటు 560 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. గేర్ బాక్స్ విషయానికొస్తే… 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ అమర్చారు. ఇక 3.4 సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకునే స్టెరాటో గరిష్ట వేగం గంటకు 260 కిలోమీటర్లు. హురాకాన్ సిరీస్ లోని ఇతర వేరియంట్లతో పోలిస్తే… స్టెరాటో వేగం కాస్త తక్కువే. అలాగే వంద కిలోమీటర్ల వేగం అందుకోవడంలోనూ 0.1 సెకన్లు వెనుకబడి ఉంది. అయితే గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం హురాకాన్ స్టాండర్డ్ మోడల్ కంటే 44mm ఎక్కువ. ఆఫ్ రోడ్ డ్రైవ్ కోసం సస్పెన్షన్ కూడా ముందువైపు 33mm, వెనుకవైపు 34mm పెంచారు. ఇక వీల్ సైజ్ 19 అంగుళాలు ఉంది. డిజిటల్ ఇంక్లినోమీటర్, కంపాస్, జియోగ్రాఫిక్ కోఆర్డినేట్ ఇండికేటర్, స్టీరింగ్ యాంగిల్ ఇండికేటర్… స్టెరాటోలోని అదనపు హంగులు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×