BigTV English

Lawrence Bishnoi : సినిమాను మించిన ట్విస్టులు .. లారెన్స్ బిష్ణోయ్ ను గ్యాంగ్ స్టర్ చేసిన సంఘటన ..

Lawrence Bishnoi : సినిమాను మించిన ట్విస్టులు .. లారెన్స్ బిష్ణోయ్ ను  గ్యాంగ్ స్టర్ చేసిన సంఘటన ..

Lawrence Bishnoi : లారెన్స్ బిష్ణోయ్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. దేశ వ్యాప్తంగా ఏఈ పేరు మారు మోగిపోతుంది. ఉత్తర భారతదేశం మొత్తాన్ని భయపెడుతున్న లారెన్స్ బిష్ణోయ్.. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యల తో దేశం మొత్తం పరిచయం అయ్యాడు. అయితే అతను జైలులోనే ఉన్నా.. అనుచరులతో ఈ హత్యలు చేయించడం.. ఇక బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బహిరంగంగానే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులకు దిగడం, కాల్పులు జరపడం తీవ్ర సంచలనంగా మారింది. అయితే గొప్ప చదువులు చదువుకున్నాడు . మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అసలు అతను గ్యాంగ్ స్టర్ గా మారడానికి కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


లారెన్స్ బిష్ణోయ్ ఆశలు జీవితం ఇదే ..

31 ఏళ్ల లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్ అహ్మదాబాద్‌లోని సబర్మతీ సెంట్రల్ జైలులో ఉన్నాడు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ జిల్లా ధత్తరన్‌వాలీలో 1993లో లారెన్స్ బిష్ణోయ్ జన్మించాడు. లారెన్స్ బిష్ణోయ్ అసలు పేరు బాల్‌కరణ్ బరార్. హర్యానా పోలీస్ శాఖలో పనిచేసే ఓ కానిస్టేబుల్ కుమారుడే ఇతను . వీరిది ధనిక కుటుంబం. ఇతను బాగానే చదువుకున్నాడు . దేవుడి పూజ చేయనిదే బయటకు రాడు. అలాంటి ఆధ్యాత్మిక చింతన ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు ఇలా మారడం ఏంటి అని జనాలు ఆలోచిస్తున్నారు. ఇక అబోహర్‌లోని కాన్వెంట్ స్కూల్‌లో చదువుతున్న సమయంలోనే తన క్లాస్‌మేట్‌పై లారెన్స్ బిష్ణోయ్ ఇష్టం పెంచుకున్నాడు. ఆ తర్వాత చండీగఢ్ డీఏవీ కాలేజీలో ఉన్నత చదువులు చదివే సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది..


ఒకవైపు ప్రేమ.. మరోవైపు చదువులు సాఫీగా సాగుతున్న సమయంలోనే పంజాబ్ యూనివర్సిటీ పరిధిలోని డీఏవీ కాలేజీలో చదువుతున్న సమయంలో స్టూడెంట్ రాజకీయాల్లోకి లారెన్స్ బిష్ణోయ్ అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ- ఎస్ఓపీయూని స్థాపించాడు. అయితే అందరిని గుడ్డిగా నమ్మాడు. ఆ రాజకీయాల్లో గెలుస్తానని అనుకున్నాడు. కానీ దారుణంగా ఓడిపోవడంతో అందరి పై కోపంతో రగిలిపోయాడు. కాలేజీ రాజకీయాలను తన కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు రివాల్వర్‌ను తన వద్ద ఉంచుకునేవాడు. అంతేకాదు లారెన్స్ లా కోర్సు పూర్తి చేసాడు . ఆ తర్వాత రాజకీయాల కారణంగా గ్యాంగ్ స్టర్ మారాడు.. గోల్డీ బ్రార్‌తో పరిచయం ఏర్పడగా.. వీరిద్దరూ కలిసి చిన్న చిన్న నేరాల వైపు మళ్లారు. ఈ క్రమంలోనే 2011లో బిష్ణోయ్ గ్రూప్‌కు ప్రత్యర్థులకు మధ్య ఉన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కాస్తా హింసకు దారి తీశాయి. అయితే ఈ గొడవల్లోనే లారెన్స్ బిష్ణోయ్ లవర్‌ను ప్రత్యర్థి వర్గం సజీవంగా దహనం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.. ప్రేయసి మరణం తర్వాత అతను స్టూడెంట్ లీడర్స్ ను కూడా చంపేశాడు.

ఇక 2018లో సంపత్‌ నెహ్రా అనే వ్యక్తితో కలిసి సల్మాన్‌ ఖాన్‌ను హత్య చేసేందుకు లారెన్స్ బిష్ణోయ్ కుట్ర చేయడంతో వార్తల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో 700 మంది షూటర్లు ఉన్నారు. అతను జైల్లో ఉన్నా కూడా బయట తన అనుచరులతో హత్యలు చేయిస్తున్నాడు. అతి చిన్న వయసులోనే ఇలా మారడం పై చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ఈ స్టోరీ సినిమాను తలపిస్తుంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×