BigTV English

Ram Gopal Varma : ఏందయ్యా వర్మా .. మరో రచ్చకు కథ సిద్ధం చేస్తున్నావా ?

Ram Gopal Varma : ఏందయ్యా వర్మా .. మరో రచ్చకు కథ సిద్ధం చేస్తున్నావా ?

Ram Gopal Varma : టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు . ఈయన ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు . ఈయన డైరెక్షన్ లో అప్పటిలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యేది. అలాంటి వర్మ తో సినిమాలు చెయ్యాలని స్టార్ హీరోలు సైతం పోటీ పడేవారు. ఇక ఈ మధ్య ఈయన సినిమాల కన్నా కూడా వివాదాలతో బాగా ఫెమస్ అయ్యాడు. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేసి గొడవలు చేస్తాడో అని భయపడుతున్నారు. ఇక ఇటీవల రాజకీయ నాయకులను కూడా వర్మ వదల్లేదు. వారిని కూడా వణికించేలా సినిమాలు చేసి వివాదాలను మూట కట్టుకున్నాడు. . ఇక ఇప్పుడు ఏకంగా గ్యాంగ్ స్టర్ జీవితాన్నే సినిమా చేస్తానని రెడీ అవుతున్నాడు. నిజంగా ఇలాంటి ఆలోచనలు చెయ్యడం కేవలం వర్మకే సాధ్యం . ఇంతకీ ఆ గ్యాంగ్స్ స్టర్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం..


ప్రస్తుతం ప్రపంచాన్ని గడ గడ లాడించాడు. సినిమా స్టార్స్ పై కూడా సవాల్ విసిరాడు. ఆ గ్యాంగ్ స్టర్ ఎవరో కాదు లారెన్స్ బిష్ణోయ్. దేశ వ్యాప్తంగా ఏఈ పేరు మారు మోగిపోతుంది. ఉత్తర భారతదేశం మొత్తాన్ని భయపెడుతున్న లారెన్స్ బిష్ణోయ్.. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యల తో దేశం మొత్తం పరిచయం అయ్యాడు. అయితే అతను జైలులోనే ఉన్నా.. అనుచరుల తో ఈ హత్యలు చేయించడం.. ఇక బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బహిరంగంగానే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులకు దిగడం, కాల్పులు జరపడం తీవ్ర సంచలనంగా మారింది. అయితే గొప్ప చదువులు చదువుకున్నాడు . మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అసలు అతను గ్యాంగ్ స్టర్ గా మారడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఆయన జీవితంలో ఎన్నో మలుపులు .. గ్యాంగ్స్టర్ అవ్వడాన్ని ప్రేరేపించిన సంఘటనలపై గతంలో వర్మ సినిమాను చేస్తానని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. . బిష్ణోయ్ బయోపిక్ తీస్తే ఎవరిని హీరోగా పెట్టి తీస్తాడో అనేది ఆసక్తిగా మారింది.. మరి ఈ సినిమాను ఎప్పుడు ప్రకటిస్తాడో తెలియదు కానీ అప్పుడే విమర్శలు మొదలయ్యాయి.

ఇక ఆర్జీవీ ప్రస్తుతం శారీ అనే బోల్డ్ మూవీని చేస్తున్నాడు. వర్మ తాను అన్న మాటను నిజం చేస్తున్నారు. ఆమె చీరకట్టుకు ఫిదా అయిన వర్మ.. ఆనాడే ఆమెతో సినిమా చేస్తానని అనేసిన సంగతి తెలిసిందే. ఇక ఆనాడే ఆ మూవీ పేరు శారీ అని కూడా ఫిక్స్ అయ్యాడు. అదే పేరుతో ఇప్పుడు వర్మ ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. శ్రీలక్ష్మీ సతీష్‌ను హీరోయిన్‌గా పెట్టి శారీ అనే చిత్రాన్ని వర్మ తీస్తున్నాడు. ఈ 22 ఏళ్ల అమ్మాయి వర్మ వల్ల మరింతగా ఫేమస్ అయింది. ఆమె చీరకట్టు వీడియోలకు బాగానే డిమాండ్ ఉండేది. కానీ వర్మ ఒక్కసారిగా ఆ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేయడంలో ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగింది. ఆ భామ గురించి. ఈ సినిమాకు అరిఫిషియల్ టెక్నాలజీ తో సాంగ్స్ తో చేస్తున్నాడు. ఈ సినిమా పై ఆసక్తిని కలిగిస్తుంది సినిమా ఎలా ఉంటుందో చూడాలి..0


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×