BigTV English

Haldi adulteration: మీరు ఇంట్లో వాడే పసుపు మంచిదేనా లేక కల్తీదా? పసుపు కల్తీని ఇలా ఇంట్లోనే చెక్ చేయండి

Haldi adulteration: మీరు ఇంట్లో వాడే పసుపు మంచిదేనా లేక కల్తీదా? పసుపు కల్తీని ఇలా ఇంట్లోనే చెక్ చేయండి

Haldi adulteration: మార్కెట్లో కల్తీ ఉత్పత్తులు ఎక్కువగా వస్తున్నాయి. అవి మంచివో కాదో తెలుసుకోవడం ప్రజలకు కష్టంగా మారింది. మనం ఇంట్లో ప్రతిరోజూ వాడే వాటిలో పసుపు ఒకటి. పసుపు లేకుండా ఏ కూర పూర్తికాదు. మనం వాడే పసుపు కల్తీదో కాదో ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు. పసుపు కలిపి అయితే దాన్ని వాడకపోవడమే మంచిది. కొన్ని పరీక్షల ద్వారా పసుపు కల్తీని గుర్తించవచ్చు. ఫుడ్ సేఫ్టీ అధారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పసుపులోని కల్తీని ఎలా గుర్తించాలో చెప్పారు.


పసుపు కల్తీని ఇలా కనిపెట్టండి
ఒక పెద్ద గ్లాస్ నీటిని తీసుకోవాలి. అందులో ఒక స్పూను పసుపు వేయాలి. పసుపు వేసాక ఆ నీరు లేత పసుపు రంగులోకి మారిపోతుంది. కొంత పసుపు గ్లాస్ అడుగుభాగానికి చేరుకుంటుంది. ఇలా లేత పసుపు రంగులోకి నీరు మారి, కొంత అడుగుభాగానికి చేరితే ఆ పసుపు మంచిదని అర్థం. అదే నకిలీ పసుపు అయితే గ్లాసులోని నీరు చిక్కగా మారిపోతుంది. పసుపు కూడా అడుగు భాగం వరకు చేరదు. ఇలా నీరు చిక్కగా మారి అడుగుభాగానికి పసుపు చేరకపోతే అది కల్తీ పసుపు అని అర్థం చేసుకోండి.

Also Read: ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే చేయాల్సినవి ఇవే !


కేవలం పసుపు పొడి నే కాదు పసుపు కొమ్ములను కూడా కల్తీ చేస్తున్నారు. పసుపు కొమ్ములను కొని ఇంటిదగ్గర పొడి చేసుకునే వారికి కూడా కల్తీ పసుపు వచ్చే అవకాశం ఉంది. పాడైపోయిన పసుపు కొమ్ములకు పసుపు రంగు వేసి అమ్మేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇందుకోసం మీరు ఒక గ్లాసు నీటిని తీసుకోవాలి. పసుపు కొమ్ములను ఆ నీటిలో వేయాలి. ఆ నీటి రంగు మారకపోతే అది అసలైన పసుపు కొమ్ము అని అర్థం చేసుకోవాలి. గ్లాసులోని నీటి రంగు పసుపు రంగులోకి మారిపోతే అది కల్తీదని అర్థం. ఆ పసుపు కొమ్ముకు పసుపు రంగును వేసి అమ్ముతున్నారని అర్థం చేసుకోండి.

పసుపు పొడిని ప్రతిరోజు వాడాల్సిన అవసరం ఉంది. ఇది మన శరీరానికి రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ. ఇది గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుంది. పేగుల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. గోరువెచ్చని నీటిలో పసుపును వేసి ప్రతిరోజూ తాగితే ఎంతో మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలన్నా కూడా పసుపును ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం.

Related News

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Dengue Fever: వర్షాకాలంలో జ్వరమా ? డెంగ్యూ కావొచ్చు !

Big Stories

×