Big Stories

Lettuce Soup : పాలకూర సూప్‌తో రక్తహీనతకు చెక్‌

Lettuce Soup : కూరగాయల కంటే ఆకు కూరల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందులో పాలకూర విషయానికి వస్తే ఇందులో అన్నింటికంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా రుచిలో కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా పాలకూరతో స్మూతీలు, సూప్‌లు తయారు చేసుకుంటే ఎన్నో మంచి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. పాలకూర కళ్లకు మేలు చేస్తుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి, కంటి వ్యాధుల ప్రమాదాన్ని నివారించటానికి విటమిన్- ఎ, విటమిన్‌-సి ఇందులో పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా పాలకూర అధిక బరువును కూడా నియంత్రిస్తుంది. అధిక బరువు ఉన్నవారు చాలా వరకు ఆహారం తగ్గిస్తుంటారు. అయితే బరువును తగ్గించుకోవాలనుకుంటే ఆహారం మానేయకుండా పోషకాలను అందించే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవాలంటున్నారు. పాలకూరలో కేలరీలు తక్కువ ఉంటాయి, దీంతో బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. పాలకూరలో మంచి మోతాదులో ఇనుము ఉండటం వల్ల రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పాల కూర సూప్‌లో ఎక్కువ పోషకాలు ఉంటాయని చెబుతున్నారు. సూప్‌ కోసం పాన్‌లో నూనె వేడి చేసి అందులో రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు, ఒక ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. దాంట్లో సన్నగా తరిగిన పాలకూర 250 గ్రాములు, ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి చిన్న సెగపై 10 నిమిషాలు ఉడికించాలి. మరో పాన్‌లో టేబుల్‌ స్పూన్‌ వెన్న వేసి వేడి చేసి అందులో 2 టేబుల్‌ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌, పాలు వేసి క్రీమ్‌ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రీమ్‌లో అన్ని మసాలాలు, పాలకూరను కలపాలి. గ్లాసు నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించాలి. చివరగా టేబుల్‌ స్పూన్‌ క్రీమ్‌ కలపాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News