BigTV English

Lithium Air Battery:ఒక్కసారి ఛార్జింగ్ పెడితే చాలు.. వెయ్యి మైళ్లు ప్రయాణించవచ్చు..!

Lithium Air Battery:ఒక్కసారి ఛార్జింగ్ పెడితే చాలు.. వెయ్యి మైళ్లు ప్రయాణించవచ్చు..!

Lithium Air Battery:ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టెక్నాలజీ వల్ల ఎన్నో కొత్త మార్పులే ఏర్పడ్డాయి. పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వచ్చి చేరాయి. పూర్తిస్థాయిలో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి అందరి దగ్గరికి చేరాలంటే ఇందులో ఉన్న ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరకాలి. అందులోనూ ముందుగా ఛార్జింగ్ తొందరగా అయిపోవడం అనేది కామన్ సమస్యగా మారింది. తాజాగా శాస్త్రవేత్తలు దీనికి ఒక పరిష్కారాన్ని గుర్తించారు.


ఎలక్ట్రిక్ కార్లు ఉన్న చాలామంది దిగులు బ్యాటరీ గురించే. ఒక్కసారి కారుకు ఛార్జింగ్ పెడితే వెయ్యి మైళ్లు దూరం ప్రయాణించే విధంగా సౌలభ్యం ఉండే బాగుండేది అని వారు భావిస్తూ ఉన్నారు. ఇదే విషయంపై అమెరికాలోని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. ఒక కొత్త రకమైన బ్యాటరీ తయారు చేయడం వల్ల ఎలక్ట్రిక్ కార్ల ఓనర్ల కల నిజం కానుందని వారు తెలిపారు. ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ (డీఓఈ) కలిసి ఈ పరిశోధనలను విజయవంతం చేశారు.

లిథియం ఎయిర్‌తో తయారు చేసే బ్యాటరీలను ఉపయోగించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు ఒక్క ఛార్జ్‌తో ఎక్కువ దూరం ప్రయాణించగలవని శాస్త్రవేత్తలు గుర్తించారు. కేవలం కార్లకు మాత్రమే కాదు జాతీయ విమానాలకు, పెద్ద ట్రక్కులకు కూడా ఈ కొత్త రకమైన బ్యాటరీతో ఛార్జింగ్ పెట్టి నడిపించవచ్చని వారు బయటపెట్టారు. ఎలక్ట్రోలైట్‌ను లిక్విడ్ స్టేట్‌లో కాకుండా సాలిడ్ స్టేట్‌లో తీసుకుంటే లిథియం ఎయిర్ బ్యాటరీ తయారవుతుందని వారు తెలిపారు.


మామూలుగా ఎలక్ట్రిక్ కార్లకు కావాల్సిన బ్యాటరీ లిథియం ఐరన్‌తో తయారు చేస్తారు. ఆ స్థానంలో లిథియం ఎయిర్ బ్యాటరీ ఉపయోగిస్తే.. పదే పదే ఛార్జింగ్ పెట్టకుండా ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. తే కాకుండా లిథియం ఐరన్ బ్యాటరీని ఎక్కువ ఛార్జింగ్ పెడితే అది వేడిగా అయ్యి అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా లిథియం ఐరన్ కంటే లిథియం ఎయిర్ బ్యాటరీలు నాలుగు శాతం మెరుగ్గా పనిచేస్తాయని వారు చెప్తున్నారు.

దాదాపు పదేళ్ల నుండి లిథియంలో ఆక్సిజన్‌ను కలిపి బ్యాటరీలు తయారు చేయడానికి అమెరికా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ పరిశోధనలు సక్సెస్ అవ్వగా.. వచ్చేతరం వారికి బ్యాటరీల ఛార్జింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారు భావిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 1000 ఎలక్ట్రిక్ సైకిళ్లపై ఈ లిథియం ఎయిర్ బ్యాటరీని ప్రయోగించి చూశారు శాస్త్రవేత్తలు. లిథియం ఎయిర్ బ్యాటరీపై మరిన్ని పరిశోధనలు చేసి దానిని మరింత మెరుగ్గా మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Webb Telescope: 700 మిలియన్ ఏళ్లనాటి గ్యాలక్సీలను కనుగొన్న టెలిస్కోప్..

Fingertip:వేలి స్పర్శతో దానిని కనిపెట్టవచ్చు..

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×