BigTV English

Made in India Cars : మేడ్ ఇన్ ఇండియా’ మోడర్న్ కార్స్.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్రేజ్..

Made in India Cars : మేడ్ ఇన్ ఇండియా’ మోడర్న్ కార్స్.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్రేజ్..


Made in India Cars : ఆటోమొబైల్ రంగంలో ఉండే పోటీ గురించి ఎక్కువగా బయటికి మాట్లాడకపోయినా.. ఇతర రంగాలతో పోలిస్తే ఇందులో కాస్త పోటీ గట్టిగానే ఉంటుంది. ఈ రంగంలో ప్రపంచ దేశాల మధ్య ఉన్న పోటీ మాత్రమే కాకుండా.. దేశంలో వేర్వేరు సంస్థలపై కూడా ఎప్పుడూ పోటీ నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల ఆటోమొబైల్ రంగాలతో పోటీ పడడం కోసం ఇండియా చాలా కష్టపడుతోంది. ఇప్పటికి ఇండియా కష్టం ఫలిస్తున్నట్టుగా నిపుణులు చెప్తున్నారు.

ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ముఖ్యంగా 2 వీలర్స్ కంటే 4 వీలర్స్ మధ్యే ఎక్కువ పోటీ నడుస్తోంది. మోడర్న్ కార్స్ అనేవి ఇప్పుడు టెక్నాలజీ ఆన్ వీల్స్‌గా పరిగణించబడుతున్నాయి. కానీ వీటి తయారీ విషయంలో మాత్రం కంపెనీలు చాలా కష్టపడుతున్నామని బయటపెట్టారు. రూల్స్‌కు తగినట్టుగా, అన్ని విషయాల్లో సేఫ్టీ చూసుకుంటూ మోడర్న్ కార్లను తయారు చేయడం అంత ఈజీ కాదన్నారు. సంస్థలు తయారు చేసే విధానంతో కస్టమర్లు తృప్తి చెందితేనే కంపెనీలకు లాభాలు వస్తాయన్నారు. సంస్థలు తయారు చేసే విధానం, కస్టమర్లు కోరుకునే కంఫర్ట్ మధ్య చాలా గ్యాప్ ఉంటుందని చెప్తున్నారు.


అన్ని కష్టాలను దాటుకుంటూ ఇప్పుడు ‘మేడ్ ఇన్ ఇండియా’ ట్యాగ్‌తో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్న మోడర్న్ కార్స్.. మరింత బ్రైట్‌గా, మరింత లైట్‌గా కస్టమర్లను ఆకర్షించే స్థాయికి చేరుకున్నాయని తాజాగా తేలింది. మోడర్న్ కార్స్ తయారీ విషయంలో ఎంతోమంది ఇంజనీర్లు, సేఫ్‌గా ఉండే టెక్నాలజీలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే దీని తయారీ సులువుగా మారుతుంది. ప్రస్తుతం ఇండియాలో తయారవుతున్న కార్లు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయంటే దానికి ముఖ్య కారణం హాట్ స్టాంపింగ్ లాంటి టెక్నాలజీలే అని నిపుణులు భావిస్తున్నారు.

కార్ నిర్మాణంలో మెటల్ స్టాంపింగ్ అనేది కీలక పాత్రలు పోషిస్తాయి. అందులో రెండు రకాల స్టాంపింగ్ మెథడ్స్ ఉంటాయి. అవే కోల్డ్ స్టాంపింగ్, హాట్ స్టాంపింగ్. గత కొన్నేళ్లలో హాట్ స్టాంపింగ్ విషయంలో ఇండియా పలు కొత్త రకమైన టెక్నాలజీలను ఉపయోగిస్తోంది. అందుకే కార్ స్ట్రక్చర్ అనేది ఆకర్షనీయంగా మారుతూ వస్తోంది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న కార్ తయారు చేసే సంస్థలు అన్ని ఈ హాట్ స్టాంపింగ్ మెథడ్‌ను వరంగా భావిస్తున్నాయి. ఇది సేఫ్టీని అందిస్తూనే కార్ స్ట్రక్చర్‌ను కూడా కస్టమర్లకు నచ్చే విధంగా మార్చడం లాభాలు తెచ్చిపెట్టే విషయం అని చెప్తున్నాయి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×