BigTV English

Project 92 : ట్విటర్‌కు పోటీగా ‘ప్రాజెక్ట్ 92’.. మెటా మాస్టర్ ప్లాన్..

Project 92 : ట్విటర్‌కు పోటీగా ‘ప్రాజెక్ట్ 92’.. మెటా మాస్టర్ ప్లాన్..
Project 92


Project 92 : ఈరోజుల్లో సోషల్ మీడియా యాప్స్ అనేది ఒకదానితో మరొకటి పోటీగా యూజర్లను ఆకర్షించడానికి కొత్త కొత్త అప్డేట్స్‌ను, ఫీచర్లను తయారు చేస్తున్నాయి. ఇతర యాప్స్‌తో పోలిస్తే.. సోషల్ మీడియా యాప్స్‌లోని గట్టి పోటీ నడుస్తోంది. ఇక చాలావరకు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న సోషల్ మీడియా యాప్స్ అన్నీ తన ఆధీనంలోకి తీసుకున్న మెటా.. ఇప్పుడు ట్విటర్‌పై దృష్టిపెట్టింది. ట్విటర్ లాంటి ఒక యాప్‌ను తయారు చేసి తన మెటా యూనివర్స్‌లో కలుపుకోవాలి అనుకుంటోంది.

ఇప్పటికే ఇతర సోషల్ మీడియా యాప్స్‌ను చూసి కాపీ కొడుతుంది అని మెటాకు విమర్శలు ఎదురవుతున్నాయి. కరెక్ట్‌గా గమనిస్తే.. అది కూడా కొంతవరకు నిజమే అనిపిస్తోంది. టిక్ టాక్‌లో వీడియోలను ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది మెటా. స్నాప్‌చాట్‌లోని స్ట్రీక్స్‌ను ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీల ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇలా ఇప్పటివరకు మెటా ఆధ్వర్యంలో ఉన్న ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో ఎన్నో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చి రోజురోజుకీ వీటి రూపురేఖలే మారిపోతున్నాయి.


ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్.. లాంటి సోషల్ మీడియా యాప్స్‌తో మరోపాటు మరో యాప్‌ కూడా ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. అదే ట్విటర్. అందుకే ట్విటర్‌ లాంటి ఒక యాప్‌ను తయారు చేసి మెటా యూనివర్స్‌లో కలిపేయాలని చూస్తున్నాడు మార్క్ జుకెన్‌బర్గ్. ఇప్పటికే దీనికి తగిన సన్నాహాలు మొదలయ్యాయని టెక్ రంగంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మెటా అనేది స్థాపించిన తర్వాత నుండి ట్విటర్‌కు పోటీగా యాప్‌ను తయారు చేయాలని మార్క్ బలంగా ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది.

ట్విటర్‌కు పోటీగా మార్క్ కొత్త యాప్‌ను తయారు చేస్తున్నాడు అనే రూమర్స్ వైరల్ అవుతున్న క్రమంలో ట్విటర్ సీఈఓ లిండా యాక్కరినో ‘గేమ్ ఆన్’ అని ట్వీట్ చేయడం.. ఇది మరింత హాట్ టాపిక్‌గా మారేలా చేస్తోంది. ఇప్పటికే ట్విటర్‌కు పోటీగా రానున్న యాప్‌ ప్రివ్యూను ఉద్యోగులకు చూపించిందట మెటా. ప్రస్తుతం ఇంకా ఈ యాప్‌కు పేరేమీ పెట్టకపోయినా.. ‘ప్రాజెక్ట్ 92’ అనే కోడ్‌నేమ్‌తో ఈ యాప్ తయారవుతుందని సమాచారం. తాజాగా ప్రాజెక్ట్ 92కు సంబంధించి కొన్ని స్క్రీన్‌షాట్స్ వైరల్ అయ్యాయి.

ఈ స్క్రీన్‌షాట్స్ ప్రకారం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఐడీతో లాగిన్ అయ్యే అవకాశాన్ని ట్విటర్ పోటీ యాప్ కల్పిస్తోందని తెలుస్తోంది. ట్విటర్‌లో ఉన్నట్టుగా రీట్వీట్ లాంటి రీషేర్ ఆప్షన్ కూడా ఇందులో ఉండనుంది. దీనిని చూస్తుంటే దాదాపుగా ట్విటర్‌ను చూసినట్టే ఉందని యూజర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఈ ప్రాజెక్ట్ 92 యాప్‌లో సెలబ్రిటీలు జాన్ అయ్యి.. వారే దీనిని ప్రమోట్ చేసే విధంగా మెటా యాజమాన్యం సన్నాహాలు మొదలుపెట్టింది. అంతే కాకుండా ట్విటర్ కంటే ఎక్కువగా ప్రైవసీ విషయంలో జాగ్రత్తలు తీసుకోనుందట ప్రాజెక్ట్ 92.

Related News

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… భర్త పై పగతో రగిలిపోయే అమ్మాయిలు… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Big Stories

×