BigTV English

Toothpaste: ఇంట్లోనే టేస్టీ టూత్‌పేస్ట్‌ తయారుచేసుకోండి

Toothpaste: ఇంట్లోనే టేస్టీ టూత్‌పేస్ట్‌ తయారుచేసుకోండి

పాతకాలంలో టూత్‌పేస్ట్‌కు బదులు ఉప్పు, బొగ్గులపొడిని వాడేవారు, బ్రష్‌కు బదులు వేపపుల్లలను వినియోగించేవారు. ఇప్పుడు మనం కెమికల్స్‌తో తయారైన
టూత్‌పేస్ట్‌లను వాడుతున్నాం. ఈ కమర్షియల్ టూత్‌పేస్ట్‌లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి, చెడు రకాల బ్యాక్టీరియాలకు చాలా హానికరం అని నిపుణులు అంటున్నారు. ట్రైక్లోసన్ వాస్తవానికి నిషేధించబడింది. ఎందుకంటే ఇది ఎండోక్రైన్ డిస్ట్రప్టర్‌గా పనిచేస్తుంది. షాంపూల్లో వాడే సోడియం లారిల్ సల్ఫేట్‌ను టూత్‌పేస్ట్‌లో ఉంచి నురుగు లేదా ఫోమింగ్ డిటర్జెంట్‌లా రావడానికి కొన్ని కంపెనీలు వాడుతున్నాయి. అంతేకాకుండా టూత్‌పేస్ట్‌లో ప్రొపైలిన్ గ్లైకాల్, డయాక్సిన్ అనే క్యాన్సర్ కారకాన్ని కూడా వాడుతున్నారు. అంతేకాకుండా కృత్రిమ రుచులు, కృత్రిమ రంగుల కోసం ఎండోక్రైన్ వ్యవస్థకు నష్టంచేకూర్చే కొన్ని పారాబెన్‌లు, ఫార్మాల్డిహైడ్‌గా మారే రసాయనాలు వినియోగిస్తున్నారు. ఈ కెమికల్‌ టూత్‌పేస్టులు లాలాజలం మైక్రోబయోమ్, కెమిస్ట్రీని మారుస్తాయి. అందుకే మీ ఇంట్లోనే టూత్‌పేస్ట్‌ను ఈ విధంగా తయారుచేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకుని, ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, ఒక టీస్పూన్‌లో నాలుగవ వంతు వరకు ఫుడ్ గ్రేడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకోవాలి. దాంట్లో మూడు చుక్కల దాల్చినచెక్క లేదా ఒరేగానో నూనెలను కలపాలి. అంతే మీ టూత్‌పేస్ట్‌ రెడీ. మంచి సువాసనతో పాటు పిజ్జాలాంటి రుచి కూడా పొందవచ్చు. మీ దంతాల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×